Elon Musk : ట్విట్ట‌ర్ ఫ్యూచ‌ర్ పై ఎలోన్ మ‌స్క్ కామెంట్

ఉద్యోగులు..యూజ‌ర్ల‌కు ఎన‌లేని ప్ర‌శ్న‌లు

Elon Musk  : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఒకే ఒక్క‌డు టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్(Elon Musk ). ప్ర‌స్తుతం ఆయ‌న హాట్ టాపిక్ గా మారారు. మైక్రో బ్లాగింగ్ సంస్థ‌గా ఇప్ప‌టికే టాప్ పొజిష‌న్ లో ఉన్న ట్విట్ట‌ర్ ను 44 బిలియ‌న్లు పెట్టి కొనుగోలు చేశాడు.

ఆయ‌న ట్విట్ట‌ర్ ను స్వాధీనం చేసుకునేందుకు ఇంకా ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ సిఇఓగా ఉన్న ప్ర‌వాస భార‌తీయుడైన ప‌రాగ్ అగ‌ర్వాల్ ప‌ట్ల ఆయ‌న ముందు నుంచీ విముఖ‌త‌తో ఉన్నారు.

దాంతో సిఇఓను మార్చ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఉద్యోగులు, ఖ‌ర్చు ఎలా త‌గ్గించు కోవాల‌నే దానిపై సూచించాల‌ని ఆయ‌న బ్యాంక‌ర్లు, నిపుణుల్ని కోరారు.

ఇదే స‌మ‌యంలో ఇప్ప‌టి దాకా ఉన్న సిస్ట‌మ్ నే కొన‌సాగిస్తారా లేక ఏమైనా మార్పులు చేయ‌నున్నారా అన్న ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌తి ఒక్క‌రికీ అందుబాటులో ఉండేలా, సుల‌భంగా, సౌల‌భ్యంగా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉండేలా చూడాల‌ని అనుకుంటున్నారు.

త‌న ఆలోచ‌నా విధానాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ట్విట్ట‌ర్ ను కొన్ని వివాదాలు వెంటాడాయి. ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో. త‌మ రూల్స్ అధిగ‌మించారంటూ అమెరికా మాజీ చీఫ్ ట్రంప్ ఖాతాను స్తంభింప చేసింది.

భార‌త ప్ర‌భుత్వంతో కూడా క‌య్యానికి దిగింది. మొత్తంగా స్వేచ్చ గా అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసేందుకు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఉప‌యోగ ప‌డుతోంది.

న్యూయార్క్ లోని వార్షిక మెట్ గాలాలో రెడ్ కార్పెట్ పై గుమిగూడిన మీడియాతో మాట్లాడారు ఎలోన్ మ‌స్క్(Elon Musk ). అంద‌రికీ ఇది కేరాఫ్ గా మారుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Also Read : ఊపిరి ఉన్నంత వ‌ర‌కు దేశం కోస‌మే

Leave A Reply

Your Email Id will not be published!