Elon Musk Parag Agarwal : పరాగ్ అగర్వాల్ పై మస్క్ కామెంట్స్
సిఇఓ చైర్మన్ మధ్య సంభాషణ కలకలం
Elon Musk Parag Agarwal : ట్విట్టర్ పై టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్(Elon Musk) మొదటి నుంచీ దురభిప్రాయం నెలకొంది. మొదట మైక్రో బ్లాగింగ్ సైట్ ను కొనుగోలు చేసేందుకు ఓకే చెప్పాడు. ఆపై బిగ్ డీల్ కూడా కుదిరింది. $44 బిలియన్ డాలర్లకు కుదిరిన ఒప్పందం నుంచి చివరకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ఎలోన్ మస్క్.
టెస్లా చైర్మన్ ట్విట్టర్ సిఈఓల మధ్య నెలకొన్న ఆసక్తికర సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా పరాగ్ అగర్వాల్ ప్రవాస భారతీయుడు. ఎలోన్ మస్క్ కు మొదటి నుంచి పరాగ్ పై దురభిప్రాయం ఉంది. ఇద్దరి మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది.
ఒక వేళ ట్విట్టర్ కొనుగోలు చేస్తే ఎవరు సిఈవోగా ఉండాలనే దానిపై ఓ క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించి ఎలోన్ మస్క్ జరిపిన సంభాషణలు ఆసక్తికరంగా మారాయి. ఎలోన్ మస్క్ ట్విట్టర్ సంస్థ పట్ల చేసిన వ్యాఖ్యలు సంస్థకు డ్యామేజ్ కలిగించేలా ఉన్నాయంటూ మాజీ సిఇఓ డార్సీ ఆరోపించారు.
చివరకు తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ట్విట్టర్ అమెరికా కోర్టును ఆశ్రయించింది. ఒక వేళ ఒప్పందం నుంచి తప్పుకుంటే తను చెల్లించేందుకు ఓకే అని ముందస్తుగా ఓకే చేసుకున్నాడే డీల్ కుదిరింది. కానీ ఉన్నట్టుండి తాను అడిగిన వాటిని ఇవ్వలేదనే నెపంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు మస్క్.
మొదట్లో మస్క్ పరాగ్ అగర్వాల్(Parag Agarwal) తో బాగానే ఉన్నాడు. కానీ తర్వాత ఆయన కోపం పెంచుకున్నాడని మాజీ సీఇఓ ఆరోపించాడు. ఇదే సమయంలో తాను కొనుగోలు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన అన్ని కంపెనీల సిఇఓలను కూడా సంప్రదించాడు ఎలోన్ మస్క్.
Also Read : యుద్దం వద్దే వద్దు శాంతి ముద్దు – మస్క్