Elon Musk Toilet Papers : ‘టాయిలెట్ పేప‌ర్స్’ మీదే బాధ్య‌త

ప్ర‌శ్నించిన ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్

Elon Musk Toilet Papers : టెస్లా చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ నిత్యం వార్త‌ల్లో ఉంటున్నారు. ఆయ‌న ఎప్పుడైతే ట్విట్ట‌ర్ ను రూ. 4,400 కోట్ల‌కు కొనుగోలు చేశాడో ఆనాటి నుంచి సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాడు. ఆపై 9 వేల మందికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గించాడు. ఇంటి నుంచి ప‌ని చేయ‌డం కుద‌ర‌ని చెప్పేశాడు.

మూడు నెలలు మాత్ర‌మే టైం ఇస్తున్నాన‌ని, ప‌ర్ ఫార్మెన్స్ బాగా లేక పోతే తీసి వేస్తానంటూ ప్ర‌క‌టించాడు. అంతే కాదు ఇష్ట‌మైతే ఉండండి లేక పోతే వెళ్లి పోండి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ప‌త్రిక న్యూయార్క్ టైమ్స్ సంచ‌ల‌న క‌థ‌నం రాసింది.

ట్విట్ట‌ర్ లో క‌నీసం టాయిలెట్స్ కోసం ఉప‌యోగించే పేప‌ర్స్ లేకుండా పోయాయ‌ని, దీనిని ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్(Elon Musk Toilet Papers)  కాస్ట్ క‌టింగ్ లో భాగ‌మ‌ని పేర్కొంటున్నారంటూ ఎద్దేవా చేసింది. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. టాయిలెట్ పేప‌ర్స్ లేక పోవ‌డం అనే దానిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఎలోన్ మ‌స్క్.

ఇది కావాల‌ని డ్యామేజ్ చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని మండిప‌డ్డాడు. ట్విట్ట‌ర్ లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు టాయిలెట్ పేప‌ర్లు తెచ్చుకుంటే త‌ప్పేంటి అంటూ ఎదురు ప్ర‌శ్న వేశాడు ట్విట్ట‌ర్ న్యూ బాస్. ఇక టైమ్స్ నివేదిక ప్ర‌కారం ట్విట్ట‌ర్ సంస్థ ప్ర‌ధాన కార్యాయ‌లం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది.

ఉన్న నాలుగు అంత‌స్తుల‌ను మూసి వేశాడు. కేవ‌లం రెండు అంత‌స్తుల‌లోనే కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేలా ఎలోన్ మ‌స్క్ చేశాడంటూ టైమ్స్ పేర్కొంది. కాప‌లా, భ‌ద్ర‌తా సేవ‌లు ఇక నుంచి అందుబాటులో ఉండ‌వ‌ని పేర్కొంది. దీనిని త‌ప్పు ప‌ట్టాడ్ మ‌స్క్.

Also Read : న్యూ ఇయ‌ర్ లో స‌రికొత్త‌గా ట్విట్ట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!