Elon Musk Denies : ట్విట్ట‌ర్ లో ఉద్యోగుల తొల‌గింపు అబ‌ద్దం

అదంతా అవాస్త‌వమ‌ని ప్ర‌క‌ట‌న

Elon Musk Denies : ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్ ను టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ టేకోవ‌ర్ చేసుకున్నాక కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవ‌రు ఉంటున్నారో ఇంకెవ‌రు ఉండ‌డం లేదో తెలియ‌డం లేదు.

రూ. 4,400 కోట్ల డీల్ ముగిసిన త‌ర్వాత వెంట‌నే ట్విట్ట‌ర్ ప్ర‌ధాన ఆఫీసులోకి అడుగు పెట్టాడు. అనంత‌రం టాప్ పొజిష‌న్ లో ఉన్న వారిని తొల‌గించాడు. ఆపై త‌క్కువ మందితోనే ట్విట్ట‌ర్ ను న‌డిపించాల‌ని ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇంకొంద‌రు ఎలాన్ మ‌స్క్ ఆధిప‌త్య ధోర‌ణిని నిర‌సిస్తూ ట్విట్ట‌ర్ ను వ‌దిలి పెడుతున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా ట్విట్ట‌ర్ కో ఫౌండ‌ర్ అయిన జాక్ డార్సీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ట్విట్ట‌ర్ కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో కొత్త ప్లాట్ ఫార‌మ్ ను తీసుకు రానున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇది టెస్టింగ్ టైమ్ లో ఉంద‌ని తానే ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. తాజాగా అమెరికా లోనీ ప్ర‌ధాన మీడియా అంతా టెస్లా చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ పై నిప్పులు చెరుగుతోంది.

అంతే కాదు ఉద్యోగులు ఈనెల 31 వ‌ర‌కే ప‌ని చేయాల‌ని అంత‌లోపు వెళ్లి పోక పోతే తానంత‌ట తానే తొల‌గిస్తానంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది మీడియా. ఈ త‌రుణంలో త‌న‌పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం జ‌రుగుతుండ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఎలాన్ మ‌స్క్(Elon Musk Denies).

ఉద్యోగుల‌ను తొల‌గించడం లేద‌ని స్పష్టం చేశారు. అదంతా అబ‌ద్ద‌మ‌ని పేర్కొన్నారు.

Also Read : బ్లూ టిక్ పొందాలంటే $20 చెల్లించాలా

Leave A Reply

Your Email Id will not be published!