Elon Musk : ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజం అమెరికా కార్ల కంపెనీ సిఇఓ ఎలోన్ మస్క్ విద్యాభివృద్ధి కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా విద్య పట్ల తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. విద్య అన్నది ప్రతి ఒక్కరికి అందాలని, అపుడే సమాజం అన్ని రంగాలలో ముందుకు వెళుతుందని అభిప్రాయ పడ్డారు. ఏ ఒక్కరు చదువు కోసం ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎలోన్ తెలిపారు. 37 కోట్ల మేర విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు ఎలోన్. మస్క్ గ్రూప్ కంపెనీలలో ఒకటైన మస్క్ ఫౌండేషన్ ద్వారా ఈ డబ్బులను ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మొత్తాన్ని అమెరికాలో ఎలాంటి లాభా పేక్ష లేకుండా పని చేస్తున్న, విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఖాన్ అకాడెమీకి ఇటీవల అందజేశారు. ఎలోన్ మస్క్ ఆయన సోదరుడు కింబల్ కలిసి 2002లో ఈ చారిటబుల్ ఫౌండేషన్ ను స్థాపించారు. వివిధ రంగాలకు వారు విరాళాలు ఇస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఖాన్ అకాడెమీ వార్తల్లోకి వచ్చింది ఈ విరాళం అందుకోవడం ద్వారా. ఖాన్ అకాడెమీ ఆన్ లైన్ లో ఉచితంగా ప్రపంచంలో ఎక్కడి వారైనా నేర్చుకునేలా ఏర్పాటు చేసింది. ఈ అకాడెమీని సల్ ఖాన్ 2008లో ప్రారంభించాడు.
ఆయా కోర్సులకు సంబంధించిన కంటెంట్, తరగతుల నిర్వహణ, సందేహాల నివృత్తి, కోర్సులకు పూర్తి శిక్షణ, ఆ తర్వాత సర్టిఫికెట్ల ప్రదానం. అనంతరం ఆయా సంస్థలతో ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడటం చేస్తోంది. చదువుకు సంబంధించి వీడియోలను రూపొందిస్తోంది. కంటెంట్ సులభంగా అందరికీ అర్థమయ్యేలా చూస్తోంది. అవసరమైన ప్రశ్నాపత్రాలు, వెరిఫికేషన్ చేసేందుకు ట్యూటర్లు, లెక్చరర్లు, టీచర్లను అందుబాటులో ఉంచుతోంది. ఇందు కోసం వారికి కూడా ట్రైనింగ్ ఇస్తోంది. మౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియా, యుఎస్ లలో దీని బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పటి దాకా 8.76 అమెరికన్ డాలర్ల అసెట్స్ ఉన్నాయి ఈ అకాడెమీకి.
No comment allowed please