Elon Musk Trump : ట్విట్టర్ నాదే ట్రంప్ ది కాదు
ఎలోన్ మస్క్ ఆసక్తికర కామెంట్స్
Elon Musk Trump : ట్విట్టర్ కొనుగోలు వెనుక అమెరికా మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను శాసిస్తున్న ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ , యూట్యూబ్ , ట్విట్టర్ ట్రంప్ను నిషేధించింది.
దీంతో సీరియస్ అయ్యారు ట్రంప్. ఆయా సంస్థలపై నిప్పులు చెరిగాడు. ఏకంగా తానే స్వంతంగా ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ పేరుతో స్టార్ట్ చేశాడు. ట్రంప్ కసి, కోపం మామూలుగా ఉండదని తెలిసి పోయింది.
ఈ తరుణంలో ట్విట్టర్ ను ట్రంప్ ఫ్రెండ్ టెస్లా సిఇఓ ఎలాన్ మస్క్(Elon Musk) కొనుగోలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ ను 44 బిలియన్లు పెట్టి ట్విట్టర్ ను తీసేసుకున్నాడు.
దానిని ఓన్ చేసుకోవడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఇప్పటికే ఎవరైనా భాగస్వాములు కావాలని అనుకుంటే షేర్స్ కొనుగోలు చేయవచ్చంటూ భారీ ఆఫర్ ప్రకటంచాడు మస్క్.
ఎలోన్ మామూలోడు కాదు. పక్కా వ్యాపారవేత్త. ఒక్క రూపాయి పెట్టి వేయి రూపాయలు కొల్లగొట్లాలని అనుకుంటాడు. ఇదే క్రమంలో ట్రంప్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.
ట్విట్టర్ ను కొనుగోలు చేసిన వెంటనే మొట్ట మొదటి వ్యక్తి ప్రశంసించాడు. అతడు ఎవరో కాదు డొనాల్డ్ ట్రంప్. దీంతో అన్ని వైపులా విమర్శలు తలెత్తుండడంతో మరింత డ్యామేజ్ కాకుండా ఉండేందుకు స్వయంగా ఎలోన్ మస్క్(Elon Musk) రంగంలోకి దిగాడు.
ట్రంప్ కు ఎలాంటి సంబంధం లేదన్నాడు.
Also Read : Parag Agarwal : నా పదవి పదిలం ట్విట్టర్ శాశ్వతం – సిఇఓ