Elon Musk PM Modi : అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీతో ప్రముఖ బిలియనీర్ , టెస్లా చైర్మన్, ట్విట్టర్ సిఇఓ ఎలాన్ మస్క్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ శక్తి నుంచి ఆధ్యాత్మిక వరకు అన్ని అంశాల గురించి చర్చించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాన మంత్రి తో పాటు ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తామిద్దరం మరోసారి కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఇదిలా ఉండగా స్పేస్ ఎక్స్ సంస్థ ఫౌండర్, చైర్మన్ గా ఉన్నారు ఎలాన్ మస్క్(Elon Musk). ఇది అంతరిక్షం వేదికగా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందజేస్తుంది. ఇందులో ట్రిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాడు మస్క్. తన లక్ష్యం ఒక్కటే ప్రతి రంగాన్ని అందుకోవాలని. ఇందులో భాగంగా భారత్ లో కూడా స్పేస్ ఎక్స్ ను విస్తరించాలని ప్లాన్ చేశాడు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
అమెరికాలో ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా భారత్ టెక్నాలజీ పరంగా టాప్ లో కొనసాగుతోంది. ట్విట్టర్ కు పెద్ద ఎత్తున వినియోగదారులు భారత్ నుంచి ఉన్నారు. ఎక్కువ ఆదాయం కూడా ఇక్కడి నుండే సమకూరుతోంది. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్నాక కీలక మార్పులు చేశాడు మస్క్. మొత్తంగా పీఎం మోదీ, మస్క్ ల కలయిక కొంత మేరకు లాభం చేకూరే ఛాన్స్ ఉంది.
Also Read : Elon Musk PM Modi : మోదీతో ఎలాన్ మస్క్ భేటీ
