Twitter Sued Elon Musk Fails : అద్దె క‌ట్ట‌ని మ‌స్క్ పై ఓన‌ర్ దావా

కోర్టులో పిటిష‌న్ దాఖ‌లుతో షాక్

Twitter Sued Elon Musk Fails : కొత్త ఏడాది 2023లో షాక్ త‌గిలింది ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ కు . ఇప్ప‌టికే భారీ ధ‌ర‌కు ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేశాడు. ఆపై టాప్ పొజిష‌న్ ల‌లో ఉన్న వారంద‌రినీ సాగ‌నంపాడు. ఆపై 9 వేల మందిపై వేటు వేశాడు. ఇదే స‌మ‌యంలో కింది స్థాయి సిబ్బందిని కూడా తొల‌గించాడు.

కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాడు. ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేసిన నాటి నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూ వ‌స్తున్నాడు ఎలోన్ మ‌స్క్. ఉద్యోగులు క్ష‌ణం క్ష‌ణం భ‌యం భ‌యంతో బ‌తుకుతున్నారు. ఆయ‌న‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌డిగా ఉన్న ఎలోన్ మ‌స్క్ అనుకోకుండా మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు.

ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఉన్నా ట్విట్ట‌ర్ కు సంబంధించిన ప్ర‌ధాన కార్యాల‌యాల అద్దెలు చెల్లించ‌కుండా ఉండ‌డంపై ఓన‌ర్లు మండి ప‌డుతున్నారు. 15 రోజుల కింద‌ట రెంట్ చెల్లించాల‌ని కోరినా ఎలోన్ మ‌స్క్ చెల్లించ‌లేదంటూ స‌ద‌రు ఓన‌ర్ వాపోయాడు. దీంతో లైట్ తీసుకున్న మ‌స్క్ పై కోర్టుకు ఎక్కాడు.

ఆపై త‌న అద్దె ఇవ్వ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాడంటూ ఆరోపిస్తూ కోర్టులో దావా(Twitter Sued Elon Musk Fails) వేసిన‌ట్లు ఓన‌ర్ తెలిపాడు. అమెరికాలోని ఈ ఆఫీసు కే కాదు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఉన్న ట్విట్ట‌ర్ ఆఫీసుల‌కు అద్దెలు చెల్లించ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు ఎలోన్ మ‌స్క్.

అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో లోని హార్డ్ ఫోర్డ్ బిల్డింగ్ 30వ అంత‌స్తులో ట్విట్ట‌ర్ ప్ర‌ధాన ఆఫీసు ఉంది. మ‌స్క్ ను క‌లిసి త‌న కు అద్దె చెల్లించాల‌ని కోరాడు. 30 లోగా చెల్లించ‌క పోతే డిఫాల్ట్ అవుతుంద‌ని వార్నింగ్ ఇచ్చాడు. రూ. 1.1 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ భ‌వ‌న యాజమాన్య సంస్థ కొలంబియా రెయిత్ ఆరోపించింది.

Also Read : కొత్త సంవ‌త్స‌రంలో మ‌స్క్ కు షాక్

Leave A Reply

Your Email Id will not be published!