Elon Musk : ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ ‘సుప్రీం’
బోర్డు డైరెక్టర్లను తొలగించిన ఒకే ఒక్కడు
Elon Musk : సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతున్న ట్విట్టర్ ఇప్పుడు డోలాయమాన స్థితికి చేరి పోతోంది. భారీ ఎత్తున ధరకు కొనుగోలు చేసిన తర్వాత సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సిఇఓ పరాగ్ అగర్వాల్ , సీఎఫ్ఓ సెగెల్, లీగల్ హెడ్ విజయా గద్దెతో పాటు మరికొందరిని బయటకు పంపించారు ఎలాన్ మస్క్.
ప్రస్తుతం అంతా ఆయనే సర్వస్వంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అమెరికా రూల్స్ ప్రకారం ఏ కంపెనీ అయినా లేదా ఏ సంస్థ అయినా తప్పనిసరిగా బోర్డు ఉండాలి. అందులో డైరెక్టర్లను కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్నాక డైరెక్టర్లను తొలగించాడు.
ఆపై మొత్తం ట్విట్టర్ లో 7,500 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా వివిధ విభాగాలలో కీలకమైన పోస్టులలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిందరిని సాగనంపేందుకు డిసైడ్ చేశారు ఎలాన్ మస్క్(Elon Musk). ప్రస్తుతం తానే రాజు తానా బంటు తానే మంత్రి అంటూ మొత్తంగా కంట్రోల్ తీసుకున్నారు.
ఎప్పుడు ఎవరికి మూడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద పోస్టుల దాకా ఊస్టింగ్ మొదలు పెట్టాడు టెస్లా చైర్మన్. ప్రస్తుతం ట్విట్టర్ కు సిఇఓగా వ్యవహరిస్తున్నారు. తనకు నచ్చిన వారిని కొందరిని ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా సింగిల్ డైరెక్టర్ గా తానే కొనసాగుతుండడం విశేషం. మొత్తంగా 75 శాతం మందిని తొలగించనున్నట్లు సమాచారం. అంటే 2,000 మందికి మాత్రమే చోటు కల్పించాలని యోచిస్తున్నట్లు టాక్.
Also Read : ట్విట్టర్ లో 25 శాతం ఉద్యోగాలకు కోత