Elon Musk Twitter : ఇక ట్విట్ట‌ర్ ఎలోన్ మ‌స్క్ ప‌రం

4400 కోట్ల డాల‌ర్ల‌కు కొనుగోలు

Elon Musk Twitter : ప్ర‌పంచ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ వ్యాపార‌వేత్త‌గా, కుబేరుల్లో ఒక‌డిగా పేరొందిన టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చాడు. నిన్న‌టి దాకా ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేయాలా వ‌ద్దా అన్న మీమాంశలో ఉన్న ఎలోన్ మ‌స్క్(Elon Musk Twitter) ఉన్న‌ట్టుండి యూట‌ర్న్ తీసుకున్నాడు.

ఆయ‌నే స్వ‌యంగా న‌డుచుకుంటూ ట్విట్ట‌ర్ ఆఫీసులోకి వ‌చ్చాడు. ఆపై అక్క‌డే ఉన్న సింక్ ను తీసుకు వెళ్ల‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. గ‌తంలో $44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ఒప్పందం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేయ‌డం లేదంటూ ప్ర‌క‌టించి విస్తు పోయేలా చేశాడు.

ఈ త‌రుణంలో త‌ను అడిగిన స‌మాచారాన్ని ఇవ్వ‌లేదంటూ ఆరోపించాడు మ‌స్క్. దీనిని స‌వాల్ చేస్తూ ట్వి్ట‌ర్ కోర్టును ఆశ్ర‌యించింది. కోర్టు సీరియ‌స్ గా వార్నింగ్ ఇచ్చింది. వెంట‌నే ఏదో ఒక‌టి సెటిల్ చేసుకోవాలంటూ హెచ్చ‌రించింది. దీంతో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ఎలోన్ మ‌స్క్ కాళ్ల బేరానికి వ‌చ్చాడు. పైపెచ్చు చిలుక ప‌లుకులు పలికాడు.

తాజాగా 4,400 కోట్ల డాల‌ర్ల‌కు ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో ట్విట్ట‌ర్ ను స్వంతం చేసుకున్న విష‌యాన్ని వెల్లడించారు మ‌స్క్. అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్ట‌ర్ కార్యాల‌యాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. దీనినే ప్ర‌స్తావించారు మ‌ల‌స్క్.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ కు ప్ర‌వాస భార‌తీయుడైన ప‌రాగ్ అగ‌ర్వాల్ సిఇఓగా ఉన్నారు. మ‌స్క్ రాక‌తో ఆయ‌న స్థానం ఏమిట‌నేది అనుమానంగా ఉంది.

Also Read : డ‌బ్బుల కోసం ట్విట్ట‌ర్ కొన‌లేదు – ఎలాన్ మ‌స్క్

Leave A Reply

Your Email Id will not be published!