Elon Musk : ట్విట్టర్ కు వ్యతిరేకంగా ఎలోన్ మస్క్ దావా
కోర్టులో $44 బిలియన్ల డీల్ రద్దు వ్యవహారం
Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ ఈ ఏడాది నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటూ వచ్చారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు గాను $44 బిలియన్లకు పైగా డీల్ కుదుర్చుకున్నారు.
తీరా ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీనిపై ఒప్పందంలో భాగంగా తమకు ఫైన్ చెల్లించాలంటూ ట్విట్టర్ సంస్థ నోటీసులు జారీ చేసింది.
తాను అడిగిన సమాచారం ఇవ్వలేదంటూ అందుకే తాను డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను ఎలాంటి ఫైన్ చెల్లించేది లేదంటూ స్పష్టం చేశాడు.
డీల్ నుంచి మస్క్ వైదొగొలిగితే $1 బిలియన్ నష్ట పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనిని సవాల్ చేస్తూ ఎలోన్ మస్క్ కోర్టును ఆశ్రయించాడు. కౌంటర్ సూట్ దాఖలు చేశాడు.
కాగా 164 పేజీల రిపోర్ట్ కూడా తయారు చేశారు మస్క్ తరపు న్యాయవాదులు. కోర్టు రూల్స్ ప్రకారం సవరించిన సంస్కరణ త్వరలోనే బహిరంగం చేయాల్సి ఉంటుంది.
డెలావేర్ కోర్టు అక్టోబర్ 17 నుండి 5 రోజుల విచారణను ఆదేశించింది. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు నుండి వైదొలిగేందుకు సోషల్ మీడియా కంపెనీకి వ్యతిరేకంగా చట్ట పరమైన పోరాటాన్ని మరింత ఉధృతం చేశాడు ఎలోన్ మస్క్.
కానీ ట్విట్టర్ మాత్రం వదిలే ప్రసక్తి లేదంటోంది. ఇదిలా ఉండగా డెలావేర్ కోర్టు ఆఫ్ ఛాన్సరీ ఛాన్సలర్ కాథలీన్ మెక్ కార్మిక్ ట్విట్టర్ , ఎలోన్ మస్క్(Elon Musk) కేసును విచారిస్తోంది.
మరో వైపు ట్విట్టర్ ను పూర్తిగా డ్యామేజ్ చేసేందుకు యత్నించాడంటూ మైక్రో బ్లాగింగ్ సంస్థ ఆరోపించడం విశేషం.
Also Read : ‘జే’ జ్హాపకం పదిలం రతన్ టాటా భావోద్వేగం