Amit Shah : కేంద్ర హోం శాఖ అత్య‌వ‌స‌ర స‌మావేశం

ఎన్ఐఏ దాడులు..అరెస్ట్ ల‌పై అమిత్ షా ఆరా

Amit Shah : కేంద్ర హోం శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. దేశ వ్యాప్తంగా మొత్తం 11 రాష్ట్రాల‌లో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు చేప‌ట్టింది. పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు చెందిన ఉగ్ర‌వాద అనుమానితుల‌పై సోదాలు చేప‌ట్టింది.

మొత్తం 106 మందిని అదుపులోకి తీసుకుంది. దీంతో పీఎఫ్ఐ పై చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు.

స‌ద‌రు సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవాలా వ‌ద్దా అనే దానిపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. దేశం న‌లుమూలలా ఏక‌కాలంలో జ‌రిపిన దాడుల్లో ఇవాళ ఎన్ఐఏ , ఈడీ, ఆయా రాష్ట్రాల పోలీసుల‌తో క‌లిసి సోదాలు చేప‌ట్టింది.

దేశంలో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని ఆరోపిస్తూ ప‌లువురిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చేసిన వారంతా పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన వారే కావ‌డం విశేషం.

ఇప్ప‌టికే మొద‌ట తెలుగు రాష్ట్రాల్లోని ఏపీలోని క‌ర్నూలు, నంద్యాల‌, తెలంగాణ‌లోని నిజామాబాద్ , క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో సోదాలు చేప‌ట్టింది ఎన్ఐఏ. తాజాగా ఆయా రాష్ట్రాల‌తో పాటు మొత్తం 11 రాష్ట్రాల‌ను జ‌ల్లెడ ప‌ట్టంది జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌. ఇందులో పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ప్రాంగ‌ణాల్లో కొన‌సాగుతున్న సోదాలు, ఉగ్ర‌వాద అనుమానితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే దానిపై ప్ర‌ధానంగా అమిత్ షా(Amit Shah) చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు దోవ‌ల్, కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లా, ఎన్ఐఏ డైరెక్ట‌ర్ దిన‌కర్ గుప్తా పాల్గొన్నారు.

Also Read : ప్ర‌జ‌లే ప్ర‌భువులు గ‌వ‌ర్న‌ర్ కాదు – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!