AP CM YS Jagan : ఉద్యోగులు ప్ర‌భుత్వ కుటుంబ స‌భ్యులు

మీరు లేక పోతే స‌ర్కార్ లేదు - జ‌గ‌న్

AP CM YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ఉద్యోగ సంఘాల నేత‌లు, ఉద్యోగులు సీఎంను మంగ‌ళ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఆయ‌న‌ను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మీరు లేక‌పోతే ప్ర‌భుత్వ‌మే లేద‌న్నారు. ఇవాళ తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయంటే అది మీవ‌ల్ల‌నే జ‌రుగుతోంద‌న్నారు సీఎం.

కేబినెట్ మీటింగ్ లో ఉద్యోగుల‌కు జీపీఎస్ తీసుకు వ‌చ్చేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో కొంత కాలంగా వెట్టి చాకిరీ చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. తాను ఉన్నంత వ‌ర‌కు ఉద్యోగుల సంక్షేమం చూసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. గ‌తంలో ఏలిన పాల‌కులు మాయ మాట‌లు చెప్పార‌ని, మోసం చేశార‌ని మండిప‌డ్డారు.

కానీ ఏపీ స‌ర్కార్ ఉద్యోగులను కుటుంబ స‌భ్యులుగా చూసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ రెడ్డి(CM YS Jagan). ఇదిలా ఉండ‌గా కేబినెట్ లో తీసుకున్న నిర్ణ‌యాల‌న్నీ 60 రోజుల్లో పూర్తిగా అమ‌లు చేయాల‌ని ఆదేశించిన‌ట్లు చెప్పారు సీఎం. ఎక్క‌డా జాప్యం జ‌ర‌గ కూడ‌ద‌న్నారు. మీరు సంతోషంగా ఉంటే ప్ర‌జ‌లకు మేలు జ‌రుగుతుంద‌న్నారు. తాను మీకు మంచి చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు.

Also Read : Rahul Gandhi Truck Ride : ట్ర‌క్ డ్రైవ‌ర్ల‌తో రాహుల్ ముచ్చ‌ట‌

 

Leave A Reply

Your Email Id will not be published!