Twitter Employees : ఎలాన్ మ‌స్క్ కు షాక్ ఉద్యోగులు గుడ్ బై

గ‌డువుకు ముందే రాజీనామాల ప‌రంప‌ర

Twitter Employees : టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్(Elon Musk) ట్విట్ట‌ర్ ను చేసుకున్నాక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ నిన్న‌టి దాకా బెంబేలెత్తించారు. రూ. 4,400 కోట్ల రూపాయ‌లు వెచ్చించి టేకోవ‌ర్ చేసుకున్నాడు. ఆపై కాస్ట్ క‌టింగ్ అంటూ 4 వేల మందిని తొల‌గించాడు. ఆపై 5 వేల మంది కాంట్రాక్టు ఎంప్లాయిస్ పై వేటు వేశాడు.

ఇక ఏడాదికి $13 మిలియ‌న్లు కేవ‌లం ఒక్క కాలిఫోర్నియా ఆఫీసులో ప‌ని చేస్తున్న సిబ్బంది ఫుడ్ కోసం ఖ‌ర్చు చేయ‌డం ఏమిటి అంటూ నిల‌దీశారు.

ఆపై ఇక నుంచి ఎంప్లాయిస్ కు ఎలాంటి ఫుడ్ ఉండ‌ద‌ని ప్ర‌క‌టించాడు. ఫుడ్ తో పాటు ఇత‌ర ఉచిత సౌక‌ర్యాలు ఏవీ క‌ల్పించ‌డం లేదంటూ స్ప‌ష్టం చేశాడు ఎలాన్ మ‌స్క్. ఆపై ట్విట్ట‌ర్ బ్లూ టిక్ యూజ‌ర్ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ప్ర‌తి నెలా #8 డాల‌ర్లు రుసుము కింద చెల్లించాల‌ని ఆదేశించాడు.

ఇది ఈ నెల 29 నుంచి ప్రారంభం అవుతుంద‌ని వెల్ల‌డించాడు. ఈ త‌రుణంలో ఎవ‌రైనా స‌రే సంస్థ అభివృద్ది కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని ఆదేశించాడు. మూడు నెల‌ల టైం ఇస్తున్నాన‌ని ప‌ని చేసే వాళ్లు ఉండాల‌ని లేక పోతే వెళ్లి పోవ‌చ్చంటూ స్ప‌ష్టం చేశాడు ట్విట్ట‌ర్ బాస్.

ఇక నుంచి ఇంటి నుండి ప‌ని చేస్తానంటే ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నాడు. ఎవ‌రైనా స‌రే ఏ స్థాయిలో, ఏ ప‌ద‌విలో ఉన్నా ఆఫీసుల‌కు రావాల్సిందేనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

ఈ మేర‌కు త‌మ‌కు అల్టిమేటం జారీ చేయ‌డాన్ని తీవ్రంగా తీసుకున్న ఎంప్లాయిస్ ఏకంగా ట్విట్ట‌ర్ బాస్ కు రిట‌ర్న్ గిఫ్ట్ గా షాకిచ్చారు. న‌వంబ‌ర్ 17న వంద‌లాది మంది ఉద్యోగులు(Twitter Employees)  తాము రావ‌డం లేద‌ని, రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Also Read : వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వ‌ద్దు ఆఫీసు ముద్దు

Leave A Reply

Your Email Id will not be published!