Amit Shah : ములాయం మృతి తీరని లోటు – అమిత్ షా
అట్టడుగు వర్గాలకు ఎనలేని సేవలు చేశారు
Amit Shah : రాజకీయ దురంధరుడిగా, సోషలిస్టు నాయకుడిగా పేరొందిన మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి, ఎస్పీ ఫౌండర్ ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూశారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంతాపాల వెల్లువ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అయితే అత్యవసర సమయంలో సైనికుడిగా అభివర్ణించారు.
ఒక శకం ముగిసిందంటూ పేర్కొన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). ములాయం మరణించారని తెలిసిన వెంటనే యూపీలోని గురుగ్రామ్ లో మేదాంత ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన మృత దేహానికి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ట్వీట్ చేశారు అమిత్ షా.
భారత రాజకీయాల్లో ఒక శకానికి ముగింపు అని పేర్కొన్నారు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఎప్పటికీ అట్టడుగు నాయకుడిగా గుర్తుండి పోతారని సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అద్వితీయ రాజకీయ నైపుణ్యంతో దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని కితాబు ఇచ్చారు.
ఎమర్జెన్సీ సమయంలో, ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం తన గొంతును పెంచాడని పేర్కొన్నారు. భారత రాజకీయాలలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు అమిత్ చంద్ర షా. ఇదిలా ఉండగా ములాయం సింగ్ యాదవ్ మృతికి సంతాప సూచకంగా యూపీ బీజేపీ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.
ఈ విషయాన్ని స్వయంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ వెల్లడించారు. ప్రజల సమస్యల కోసం ఎనలేని కృషి చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ , డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారంటూ ప్రధానమంత్రి మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ములాయం 10 సార్లు ఎమ్మెల్యేగా , 7 సార్లు ఎంపీగా ఉన్నారు.
Also Read : ఒక శకం ముగిసింది – మాయావతి