Sanjay Raut : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటి వరకు కేంద్ర సర్కార్ ను, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ వస్తున్న శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ (Sanjay Raut)కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.
ఆయన భార్యకు చెందిన 11 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మొత్తం 11 కోట్లలో తనయుడు ప్రవీణ్ రౌత్ కు చెందిన 9 కోట్లు ఉండగా భార్యకు సంబంధించి రూ. 2 కోట్లు ఉన్నాయి.
రూ. 1000 కోట్ల పట్రా చాల్ భూ స్కామ్ కు సంబంధించి ఈడీ సంజయ్ రౌత్(Sanjay Raut) కు చెందిన అలీబాగ్ ఫ్లాట్ , ముంబై లోని ఒక్కో ఫ్లాట్ ను అటాచ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈడీ తీసుకున్న ఈ నిర్ణయానికి కొన్ని గంటల ముందే ఎంపీ సంజయ్ రౌత్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాయడం విశేషం.
భూ అవినీతికి సంబంధించిన విషయంలో ఈడీ తన పవర్స్ ను దుర్వినియోగం చేస్తోందంటూ లేఖలో ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాలను కావాలని టార్గెట్ చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ప్రస్తుతం మరాఠా సర్కార్ తరపు నుంచి సంజయ్ రౌత్ ఫైర్ అవుతూ వస్తున్నారు.
కేంద్రం బీజేపీయేతర పార్టీలు, వ్యక్తులు, వ్యవస్థలు, ప్రభుత్వాలు, సంస్థలను టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ఇదిలా ఇలాగే జరుగుతూ పోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అయినా ఈడీ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులపై ఫోకస్ పెట్టింది. ఓ మంత్రిని కస్టడీలోకి తీసుకుంది.
ఇదిలా ఉండగా సంజయ్ రౌత్ కు షాక్ ఇచ్చిన ఈడీ ఢిల్లీకి చెందిన ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు కూడా ఈడీ షాక్ ఇచ్చింది.
మనీ లాండరింగ్ కు సంబంధించి రూ. 4.81 కోట్లను అటాచ్ చేసింది.
Also Read : సమన్వయం కాంగ్రెస్ కు బలం