ED Thomas Isaac : కేరళ మాజీ మంత్రి ఐజాక్ పై ఈడీ కన్నెర్ర
కేంద్ర దర్యాప్తు సంస్థ షాకింగ్ కామెంట్స్
ED Thomas Isaac : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకింగ్ కామెంట్స్ చేసింది. మసాలా బాండ్ల కేసులో విచారణకు కేరళ మాజీ మంత్రి థామస్ ఐజాక్(ED Thomas Isaac) సహకరించడం లేదని ఆరోపించింది.
ఎఐఐఎఫ్బీ ద్వారా మసాలా బాండ్ల జారీపై ఈడీ విచారణ జరుపుతోంది. ఆర్థిక సాధనాల జారీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ముందే అనుమతి పొందినట్లు కోర్టుకు తెలిపింది.
కావాలని రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కావాలని సహకరించడం లేదని ఆరోపించింది ఈడీ(ED Thomas Isaac). దర్యాప్తును నిలిపి వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది.
కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ బోర్డు (కేఐఐఎఫ్‌బి) ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టింది ఈడీ. ఇదిలా ఉండగా కేరళ హైకోర్టు ముందు ఈడీ సమర్పించిన అఫిడవిట్ లో తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాడంటూ ఏజెన్సీ ఆరోపించింది.
ఈ విషయం గురించి తయారు చేసిన నివేదికలో స్పష్టం చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. విచారణకు సహకరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మాజీ మంత్రి ఐజాక్ ను తమ ఎదుట హాజరు కావాలని కోరుతూ గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేశామని పేర్కొంది ఈడీ. ఇదిలా ఉండగా కేంద్ర దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు.
విచారణకు దూరంగా ఉండేందుకు ఐజాక్ ప్రయత్నిస్తున్నారని ఈడీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఏజెన్సీ అధికార పరిధి నుంచి తప్పించుకుని దర్యాప్తును నిలిపి వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించింది.
Also Read : రక్తపు మరకల్ని చెరపలేం – జై శంకర్