Supreme Court : ఎవరూ ఖాళీ కడుపులతో ఉండకూడదు
సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
Supreme Court : ఈ దేశంలో అపారమైన వనరులు ఉన్నాయి. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఆకలి కేకలు ఉండేందుకు వీలులేదు. ఏ ఒక్కరూ ఖాళీ కడుపులతో ఉండేందుకు వీలు లేదు. అలా ఉన్నారని అంటే అర్థం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్లు లెక్క అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court).
ఇష్రామ్ పోర్టల్ లో నమోదైన వలస , అసంఘటిత రంగ కార్మికుల సంఖ్యతో తాజా చార్ట్ ను సమర్పించాలని న్యాయమూర్తులు ఎం. ఆర్. షా, హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఏ ఒక్కరు ఆకలితో ఉండకుండా నిద్ర పోకుండా చూసుకోవడమే మన సంస్కృతి అని స్పష్టం చేసింది.
జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహార ధాన్యాలు చివరి మనిషికి చేరేలా చూడాలని మంగళవారం సుప్రీంకోర్టు కేంద్ర సర్కార్ కు స్పష్టం చేసింది. ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఆహార ధాన్యాలు చివరి మనిషికి చేరుతున్నాయని నిర్ధారించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత..విధి కూడా. కేంద్రం ఏమీ చేయడం లేదని చెప్పడం లేదు.
కరోనా సమయంలో భారత ప్రభుత్వం ప్రజలకు ఆహార ధాన్యాలను అందించింది. అదే దానిని ఎందుకు కంటిన్యూ చేయడం లేదని ప్రశ్నించింది. కరోనా మహమ్మారి ఫలితంగా లాక్ డౌన్ ల సమయంలో వలస కార్మికుల దుస్థితికి సంబంధించిన ప్రజా ప్రయోజన అంశంపై విచారణ చేపట్టింది ధర్మాసనం. ముగ్గురు సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్ , హర్ష్ సుందర్ , జగదీప్ చోకర్ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.
Also Read : ఆర్థిక సంస్కరణలు గట్టెక్కించ లేవు