Ajit Doval : ఉగ్ర‌వాద నిర్మూల‌నే ల‌క్ష్యం కావాలి – అజిత్ దోవల్

పిలుపునిచ్చిన జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు

Ajit Doval : ఆయుధాల కంటే తీవ్ర‌వాదం మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా త‌యారైంద‌ని అన్నారు భార‌త దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవాల్. ప్ర‌పంచాన్ని టెర్ర‌రిజం స‌వాల్ చేసే స్థాయికి చేరుకుంద‌ని హెచ్చ‌రించారు. దీనిని నిర్మూలించ‌క పోతే అది పూర్తిగా క‌బ‌ళిస్తుంద‌ని అన్నారు.

ప్ర‌ధానంగా తీవ్ర‌వాదుల‌కు ఫండింగ్ చేసే దేశాల‌ను గుర్తించాల‌ని, వాటిని దూరంగా పెట్టాల‌ని పిలుపునిచ్చారు. తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్న ఆఫ్గ‌నిస్తాన్ దేశంలో తీవ్ర‌వాద నెట్ వ‌ర్క్ ల ఉనికి తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. దీని గురించి ప్ర‌తి ఒక్క దేశం ఆలోచించాల‌ని స్ప‌ష్టం చేశారు అజిత్ దోవ‌ల్ .

మంగ‌ళ‌వారం భార‌త్ , మ‌ధ్య ఆసియా దేశాల భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల స‌మావేశం ఢిల్లీలో జ‌రిగింది. క‌జ‌కిస్తాన్ , కిర్గిస్తాన్ , త‌జికిస్తాన్ , ఉజ్బెకిస్తాన్ త‌దిత‌ర దేశాల‌కు చెందిన సెక్యూరిటీ స‌ల‌హాదారులు దీనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాద నిర్మూల‌నే త‌మ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌కటించారు అజిత్ దోవ‌ల్(Ajit Doval) .

ఇందులో భాగంగా ఉగ్ర‌వాద సంస్థ‌లు మ‌రింత రెచ్చి పోవ‌డానికి, బ‌ల‌ప‌డేందుకు కొన్ని దేశాలు కావాల‌ని ఫండింగ్ చేస్తున్నాయ‌ని ఆరోపించారు. వాటిని గుర్తించామ‌ని వాటికి మిగ‌తా దేశాలు కూడా దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

లేక పోతే ఈ ఉగ్ర‌వాద సంస్థ‌లు , వాటిని న‌మ్ముకున్న ఉగ్ర‌వాదులు మ‌రికొన్ని ప్రాంతాల‌కు విస్త‌రించే అవ‌కాశం లేక పోలేద‌న్నారు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు. శాంతి, భ‌ద్ర‌త‌లే ప్ర‌ధాన‌మ‌ని ఆ దిశ‌గా మ‌ధ్య ఆసియా దేశాలు కృషి చేయాల‌ని సూచించారు.

ఇదిలా ఉండగా అజిత్ దోవ‌ల్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : ఢిల్లీ కోర్టుకు వివేక్ అగ్నిహోత్రి క్ష‌మాప‌ణ

Leave A Reply

Your Email Id will not be published!