Etala Rajender Revanth : రేవంత్ సవాల్ ఈటల్ ప్రతి సవాల్
దమ్ముంటే తేల్చుకుందా రా
Etala Rajender Revanth : రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆయా పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకరొపై మరొకరు నిప్పులు చెరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender Revanth) సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కలకలం రేపింది. ఈటల చేసిన ఆరోపణలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దానికి తెర లేపింది.
దమ్ముంటే రావాలంటూ పిలుపునిచ్చారు ఈటల రాజేందర్. ప్రస్తుతం రూ.25 కోట్ల పంచాయతీ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ సీరియస్ కామెంట్స్ చేసింది. కాంగ్రెస్ , బీజేపీ రెండూ ఒక్కటేనని ఆరోపించింది. కాగా మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి రూ. 25 కోట్లు ఇచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్.
అయితే తాను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేరు ప్రస్తావించ లేదని స్పష్టం చేశారు. ఆనాడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఢిల్లీలో కలిసి తిరిగారంటూ ఆరోపించారు ఈటల రాజేందరర్. అయితే విచిత్రం ఏమిటంటే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడం విస్తు పోయేలా చేసిందన్నారు.
జానా రెడ్డి, వెంకట్ రెడ్డి నేతలు సైతం బీఆర్ఎస్ తో పొత్తుకు సై అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఖర్గే కూడా అందుకు ఒప్పుకునేందుకు తహ తహ లాడటం నిజం కాదా అని నిలదీశారు. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారంటూ మండిపడ్డారు.
Also Read : సీఎం కాలేననే రేవంత్ కంటతడి