Etala Rajender : కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకో
ఈటల రాజేందర్ స్ట్రాంగ్ వార్నింగ్
Etala Rajender : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలని లేక పోతే పుట్టగతులు ఉండవంటూ హెచ్చరించారు. ఆవారా గాళ్లను తీసుకొచ్చి అరాచకం సష్టిస్తామని అనుకుంటే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు.
నీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈటల రాజేందర్. గతంలో ఎన్నడూ ఇలా దారుణ పదజాలం వాడలేదు. కానీ రోజు రోజుకు బీఆర్ఎస్ ఆగడాలు ఎక్కువై పోతున్నాయని అడ్డుకుని తీరుతామన్నారు.
నీ తాత దిగి వచ్చినా తనను ఓడించడం చేత కాదన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న తనను వ్యక్తిగతంగా కించ పరిచేందుకు యత్నిస్తున్నారని కానీ తాను వాటిని పట్టించు కోనన్నారు. ఎవరు ఏమిటో మొన్నటి హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తేల్చి పారేశారని అన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు ఈటల రాజేందర్(Etala Rajender).
లేక పోతే ఆ బాధ్యతను తామే తీసుకోవాల్సి వస్తుందన్నారు. 2021లో 600 కోట్లు ఖర్చు చేసినా, మద్యం ఏరులై పారించినా వర్కవుట్ కాలేదన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు చెంప ఛెళ్లుమనిపించారని అయినా నీకు బుద్ది రాలేదన్నారు. దొడ్డి దారిన నామినేటెడ్ పదవులు పొందిన వారు ఇవాళ అవాకులు చెవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Jagananna Suraksha : జగనన్న సురక్ష శ్రీరామరక్ష
