CM Bommai : నేత‌లు వీడినా కార్య‌క‌ర్త‌లు పార్టీ వెంటే

క‌ర్ణాట‌క సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై కామెంట్స్

CM Bommai : క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స్వ‌రాజ్ బొమ్మై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా పార్టీ హైక‌మాండ్ ప్ర‌క‌టించిన లిస్టులో త‌మ‌కు సీట్లు రాలేద‌ని కొంద‌రు నేత‌లు నిరాక‌ర‌ణ చేశార‌ని , మ‌రికొంద‌రు పార్టీని వీడుతామ‌ని బెదిరిస్తున్నార‌ని అన్నారు. వాటిని తాము ప‌ట్టించు కోమ‌న్నారు సీఎం. పార్టీకి చెందిన నేత‌లు వెళ్లినా ఏమీ కాద‌న్నారు. త‌మ‌కు నిబ‌ద్ద‌త క‌లిగిన కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌ని త‌మ‌కు ఢోకా లేద‌న్నారు.

రాబోయే ఎన్నిక‌ల్లో మ‌రోసారి తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు. టికెట్లు రాక పోవ‌డంతో అసంతృప్తితో ఉన్న కొంత మంది బీజేపీ నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీ చేర్చు కోవ‌డం వ‌ల్ల ఎలాంటి తేడా ఉండ‌బోద‌న్నారు. శుక్ర‌వారం క‌ర్ణాట‌క సీఎం బొమ్మై(CM Bommai) మీడియాతో మాట్లాడారు. పాత పార్టీకి 60 అసెంబ్లీ స్థానాల‌లో అభ్య‌ర్థులే ఇప్ప‌టి వ‌ర‌కు దొర‌క లేదంటూ ఎద్దేవా చేశారు.

ప్ర‌తి రాష్ట్రంలోని అధికార పార్టీలో ఎప్ప‌టి లాగే ఎక్కువ‌గా టికెట్ల కేటాయింపున‌కు సంబంధించి డిమాండ్ సహ‌జంగా ఉంటుంద‌న్నారు బొమ్మై.బీజేపీలో చోటు చేసుకున్న అస‌మ్మ‌తి గురించి ప్ర‌స్తావించ‌గా పై విధంగా స్పందించారు సీఎం. కొంత మంది కావాల‌ని బ‌య‌ట‌కు వెళ్లాల‌ని అనుకున్నారు. మేం కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడాం. వారంతా పార్టీ వైపు మాత్ర‌మే ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

త్వ‌ర‌లోనే ఎవ‌రు ఏమిటో ప్ర‌జ‌లు తేలుస్తార‌ని, న్యాయం వైపు తీర్పు త‌ప్ప‌క ఇస్తార‌ని తాను న‌మ్ముతున్న‌ట్లు చెప్పారు బ‌స్వ‌రాజ్ బొమ్మై. ఇదిలా ఉండ‌గా బొమ్మై(CM Bommai) చేసిన కామెంట్స్ పై క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ నిప్పులు చెరిగారు.

Also Read : దేశాభివృద్ది బీజేపీ ల‌క్ష్యం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!