PM Modi : పేద‌లు సైతం విమానాల్లో తిర‌గాలి – మోదీ

ఆరోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంది

PM Modi Shivamogga Airport : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో హ‌వాయి స్లిప్ప‌ర్స్ ధ‌రించిన పేద‌లు సైతం విమానాల్లో తిర‌గాల‌ని ఆరోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు. 2014కు ముందు ఎయిర్ ఇండియా స్కామ్ ల‌తో స‌హా ప్ర‌తికూల కార‌ణాల‌తో ఇబ్బంది ప‌డింద‌న్నారు. కానీ తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చా క దేశ రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచం భార‌త్ వైపు చూస్తోంద‌న్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ గాడిన ప‌డింద‌ని, ప్ర‌స్తుతం అత్యంత ప్ర‌భావంత‌మైన మార్కెట్ ను క‌లిగి ఉన్న ఏకైక దేశం మ‌న‌దేన‌ని పేర్కొన్నారు. ఇవాళ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా విమాన‌యాన రంగం అభివృద్ధిలో దూసుకు పోతోంద‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ.

క‌ర్ణాట‌కలోని శివ మొగ్గ‌లో ఏర్పాటు చేసిన ఎయిర్ పోర్టును సోమ‌వారం ప్ర‌ధాన‌మంత్రి(PM Modi Shivamogga Airport) ప్రారంభించారు. గ‌తంలో లేనంత‌గా దేశం అన్ని రంగాల‌లో ముందుకు వెళుతోంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. రానున్న రోజుల్లో భార‌త్ కు వేలాది విమానాలు అవ‌స‌రం అవుతాయ‌ని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా ప్యాసింజ‌ర్ ఎయిర్ క్రాఫ్ట్ లు వ‌చ్చే రోజులు ఎంతో దూరంలో లేవ‌న్నారు.

శివ‌మొగ్గ జిల్లాకు చెందిన క‌ర్ణాట‌క బీజేపీకి బ‌ల‌మైన వ్య‌క్తి, నాలుగు సార్లు సీఎం అయిన బీఎస్ యెడియూర‌ప్ప 80వ పుట్టిన రోజు సంద‌ర్బంగా ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వానికి ప‌దే ప‌దే అవ‌కాశం ఇవ్వాల‌ని క‌ర్ణాట‌క నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు.

Also Read : మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలిగా కుష్బూ

Leave A Reply

Your Email Id will not be published!