Mallikarjun Kharge : పోటీలో ఉన్నా మేమిద్ద‌రం సోద‌రులం

ఎంపీ శ‌శి థ‌రూర్ పై మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

Mallikarjun Kharge :  కాంగ్రెస్ అధ్య‌క్ష రేసులో ఉన్న ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అక్టోబ‌ర్ 17న పార్టీ చీఫ్ కోసం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 9,000 మంది స‌భ్యులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కోనున్నారు. ఇక ఖ‌ర్గే, థ‌రూర్ ఇద్ద‌రూ పోటా పోటీగా ప్ర‌చారం చేస్తున్నారు.

విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. త‌మ మేనిఫెస్టోల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. రాజ‌స్తాన్ లోని ఉద‌య్ పూర్ లో చేసిన డిక్ల‌రేష‌న్ ను తాను అమ‌లు చేస్తాన‌ని చెప్పారు ఖ‌ర్గే. ఇదిలా ఉండ‌గా తాను అధ్య‌క్షుడిగా ఎన్నికైతే హైక‌మాండ్ క‌ల్చ‌ర్ అంటూ ఉండ‌ద‌న్నారు థ‌రూర్. దీంతో పోటీ నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతోంది.

అక్టోబ‌ర్ 19న ఫ‌లితాలు వెల్ల‌డి అవుతాయి. ఖ‌ర్గేకు గాంధీ ఫ్యామిలీ అండ ఉండ‌గా థ‌రూర్ మాత్రం ఒంట‌రిగానే పోటీ చేస్తున్నారు. చాలా వ‌ర‌కు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా శ‌శి థ‌రూర్(Shashi Tharoor) ఒప్పుకోలేదు. పార్టీ అంటేనే ప్ర‌జాస్వామ్యానికి వేదిక కావాల‌ని ఎవ‌రో చెబితే ఎన్నుకుంటే అది డెమోక్ర‌సీ అనిపించు కోదంటూ కామెంట్స్ చేశారు.

ఆయ‌న పోటీ చేసే కంటే ముందు మేడం సోనియా గాంధీని క‌లిశారు. ఆ త‌ర్వాత బ‌రిలో ఉన్నారు. త‌న పోటీకి రాహుల్ గాంధీ సైతం మ‌ద్ద‌తు తెలిపార‌ని అన్నారు.

ఇదే స‌మ‌యంలో ఖ‌ర్గే తో త‌న‌కు ఎలాంటి శ‌త్రుత్వం లేద‌ని తాము మంచి స్నేహితుల‌మ‌ని చెప్పారు శ‌శి థ‌రూర్. ఇదిలా ఉండ‌గా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఆదివారం కీల‌క వ్యాఖ్యలు చేశారు. తాము పోటీలో ఉన్నా ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌మ‌ని పేర్కొన్నారు థ‌రూర్ ను ఉద్దేశించి.

Also Read : విష‌మంగానే ములాయం ఆరోగ్యం

Leave A Reply

Your Email Id will not be published!