Elon Musk : ఎవరైనా 12 గంటలు పని చేయాల్సిందే
ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ వార్నింగ్
Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కైవసం చేసుకున్నాక చుక్కలు చూపిస్తున్నాడు. భారీ ధరకు కొనుగోలు చేశాడు. రూ. 4,400 కోట్లకు పైగా టేకోవర్ చేసుకున్నాక వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ట్విట్టర్ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే సిఇఓ పరాగ్ అగర్వాల్ , సీఎఫ్ఓ సెగెల్, లీగల్ హెడ్ విజయా గద్దెను ఏకి పారేశాడు.
ఆపై వెంటనే వెళ్లి పోవాలని కోరాడు. ప్రస్తుతం ట్విట్టర్ లో 7,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక నుంచి ఏదీ ఉచితంగా ఉండదని చెప్పకనే చెప్పాడు ఎలాన్ మస్క్(Elon Musk) . ట్విట్టర్ లో యూజర్లు లేదా ఖాతాలు కలిగిన వారికి టిక్ మార్క్ అన్నది ఓ స్టేటస్ సింబల్ . ఇప్పుడు టిక్ మార్క్ కలిగిన వారంతా నెలకు $8 డాలర్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశాడు.
తాను పక్కా వ్యాపారవేత్తనని నిరూపించాడు. 80 శాతానికి పైగా ఉద్యోగాలలో కోత విధించే ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఎలాన్ మస్క్. ఇక నుంచి ట్విట్టర్ లో పని చేస్తున్న వారు ఎవరైనా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా విధిగా 12 గంటల పాటు పని చేయాల్సిందేనంటూ స్పష్టం చేశాడు.
వారంలో ఏడు రోజుల పాటు విధిగా పనిపై ఫోకస్ పెట్టాలన్నాడు. ఉద్యోగులు ఇచ్చిన టాస్క్ లు ఇన్ టైంలో పూర్తి చేయాలని తెలిపాడు. పని చేయక పోయినా టైమింగ్స్ పాటించక పోయినా , లేదా పనితీరు నచ్చక పోతే వెంటనే కొలువుల నుంచి తీసి వేస్తానంటూ హెచ్చరించాడు.
Also Read : ఐఫోన్ 14 ప్రో.. రోలెక్స్ వాచ్ అదుర్స్