MLC Kavitha : అంతా అబద్దం నాకేం తెలియదు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
MLC Kavitha Liquor Case : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కథ చప్పగా సాగింది. సీబీఐ ఫిర్యాదు మేరకు ఈడీ సంచలన విషయాలు వెల్లడించింది ఛార్జ్ షీట్ లో.
మనీష్ సిసోడియాతో పాటు ఎమ్మెల్సీ కవితకు ప్రమేయం ఉందని , సౌత్ గ్రూప్ కు ఆమె లీడ్ చేసిందని ఆరోపించింది. ఉదయం 11.05 నిమిషాలకు ఈడీ ఆఫీసులోకి ఎంటరైన కవిత రాత్రి 8.05 నిమిషాలకు బయటకు వచ్చింది. 9 గంటల పాటు విచారణ ఎదుర్కొంది.
ఈ సందర్బంగా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినా కూల్ గా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఏది అడిగినా నాకేం తెలియదు..నాకేం సంబంధం లేదంటూ ఒక్కటే ఆన్సర్. దీంతో ఇది కూడా పొలిటికల్ డ్రామానే తప్పా ఇంకేం కాదంటంటోంది కాంగ్రెస్ పార్టీ.
మొత్తంగా చూస్తే పొలిటికల్ గా ఫుల్ మైలేజీ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మధ్యవర్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల నెట్ వర్క్ పై కేంద్ర ఏజెన్సీలు సౌత్ గ్రూప్ అని పేర్కొంది ఈడీ.
ఏది అడిగినా ఎంతగా ప్రశ్నల వర్షం కురిపించినా నాకు తెల్వదు అంటూ చెప్పినట్లు టాక్. ఫోన్లు ధ్వంసం చేయలేదంటూ పేర్కొంది. మార్చి 16న సమన్లు ఇచ్చింది ఈడీ. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్ట్ చేసింది మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. తప్పుడు కేసులతో(MLC Kavitha Liquor Scam) వేధింపులకు గురి చేస్తున్నారని ఇప్పటికే కేంద్రంపై ఆరోపించింది కవిత, సోదరుడు కేటీఆర్.
Also Read : రావమ్మా ఎమ్మెల్సీ కవితమ్మా