Pawan kalyan: పారదర్శక పాలనకు సాక్ష్యంగా జీఓఐఆర్‌ వెబ్‌సైట్‌ను పునరుద్ధరణ: డిప్యూటీ సీఎం పవన్‌

పారదర్శక పాలనకు సాక్ష్యంగా జీఓఐఆర్‌ వెబ్‌సైట్‌ను పునరుద్ధరణ: డిప్యూటీ సీఎం పవన్‌

Pawan kalyan: పారదర్శక పాలనకు సాక్ష్యంగా జీఓఐఆర్‌ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో, ఏ ఉత్తర్వులు వెలువడుతున్నాయో తెలుసుకోవడం ప్రజల హక్కని ‘ఎక్స్‌’లో గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు వెలువరించే ఉత్తర్వులను ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. గత పాలకులు వాటిని గోప్యంగా ఉంచి ప్రజలకు సమాచారం లేకుండా చేశారు. కానీ, మా ప్రభుత్వం నాటి నియంతృత్వ పోకడల్ని తోసిపుచ్చుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని చెప్పడానికి ఈ వెబ్‌సైట్‌ పునరుద్ధరణ ఒక మచ్చుతునక అని పవన్‌ పేర్కొన్నారు.

Pawan kalyan – ఆడపడుచులకు పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక కానుక

శ్రావణమాసం చివరి శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. సొంత ఖర్చుతో 12 వేల చీరలు, పసుపు కుంకుమలు సిద్ధం చేబ్రోలులో పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) నివాసంలో ప్రత్యేక సంచుల్లో చీరలు, పసుపు కుంకుమ సర్దుతున్న మహిళలు శ్రావణమాసం చివరి శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సొంతఖర్చుతో ప్రత్యేక కానుకగా 12వేల చీరలు అందజేయనున్నారు.

పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్‌కల్యాణ్‌ పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారుచేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను సర్దారు. ఈ కార్యక్రమం రెండు రోజులుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్‌కల్యాణ్ నివాసంలో జరుగుతోంది. వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం ఉదయం పాదగయ క్షేత్రంలో అధికసంఖ్యలో పోటెత్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు 2వేల మందికే టోకెన్లు ఇవ్వగలిగారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు విడతలుగా ఆరువేల మందితో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఈఓ దుర్గాభవాని తెలిపారు.

Also Read : CM Shinde: వందసార్లు శివాజీ పాదాలు తాకేందుకు సిద్ధమే : సీఎం శిందే

Leave A Reply

Your Email Id will not be published!