Jagadish Shettar Warn : బీజేపీ హై కమాండ్ కు షెట్టర్ వార్నింగ్
నాకు టికెట్ ఇవ్వక పోతే 25 సీట్లు ఖర్చవుతాయి
Jagadish Shettar Warn : కర్ణాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తలకు మించిన భారంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు అసమ్మతి స్వరం వినిపించారు. మరికొందరు హై కమాండ్ పై భగ్గుమన్నారు.
లాబీయింగ్ చేయడం మా హాబీ కాదని అందుకే టికెట్ రాలేదన్నారు ఉడిపి ఎమ్మెల్యే రఘునాథ్ భట్. ఇక మాజీ సీఎం యడ్యూరప్ప విధేయుడిగా ఉన్న లక్ష్మణ్ సవాది ఏకంగా గుడ్ బై చెప్పారు.
కాంగ్రెస్ లోకి జంప్ అవుతానంటూ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఎంపీ కూడా రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు. ఈ తరుణంలో కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం జగదీష్ షెట్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర సర్కార్ పై, బీజేపీ హై కమాండ్ పై.
శనివారం జగదీష్ షట్టర్(Jagadish Shettar Warn) మీడియాతో మాట్లాడారు. తాను ఆదివారం వరకు వేచి చూస్తానని , ఆ తర్వాత స్వంత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు గనుక టికెట్ ఇవ్వక పోతే 25 సీట్లు బీజేపీకి రాకుండా పోతాయని సంచలన ప్రకటన చేశారు మాజీ సీఎం.
హుబ్లీ – ధార్వాడ్ సెంట్రల్ సెగ్మెంట్ నుండి అసెంబ్లీ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని వదులు కోవాలని హైకమాండ్ కోరింది. ఈ సీటుతో పాటు ఇంకా 12 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
Also Read : డబ్బులు ఇచ్చానంటే మోదీని అరెస్ట్ చేస్తారా