Mayawati Yogi : సంబురాలు సరే సమస్యల మాటేంటి
యూపీ సీఎంపై మాయావతి ఆగ్రహం
Mayawati Yogi : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్, మాజీ యూపీ సీఎం కుమారి మాయావతి(Mayawati Yogi) సంచలన కామెంట్స్ చేశారు. ఆమె మరోసారి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను టార్గెట్ చేశారు.
యూపీ ప్రభుత్వం ముచ్చటగా 100 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా సంబురాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. ఏం సాధించారని ఈ కార్యక్రమాలు అంటూ ప్రశ్నించారు మాయావతి.
మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. రాష్ట్రంలో ఇంకా పేదరికం, ద్రవ్యోల్బణం, తదితర సమస్యలన్నీ పేరుకు పోయాయని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా రాష్ట్రంలో బహజనులే టార్గెట్ గా పెట్టుకుని పాలన సాగించడం దారుణమన్నారు మాయావతి. అన్ని కులాలు, మతాల మధ్య మరింత కొట్లాటలు పెరిగేలా ప్రయత్నించడం దారుణమని పేర్కొన్నారు.
యోగి పాలన పేరుకు మాత్రమే సాగుతోందని కానీ ఎక్కడా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవన్నారు మాయావతి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ సైతం ప్రచార ఆర్బాటం తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ధ్వజమెత్తారు బీఎస్పీ చీఫ్.
పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని వాపోయారు. చివరకు రక్షణ శాఖలో సైతం భర్తీ ప్రక్రియ కేవలం కాంట్రాక్టుకే పరిమితం చేసిన ఘనత బీజేపీ సర్కార్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు మాయావతి.
ముందు సంబురాలు మానేసి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు సీఎం యోగి ఆదిత్యానాథ్ కు.
Also Read : కర్ణాటక సీఎంను బర్తరఫ్ చేయాలి – రాహుల్
यूपी भाजपा सरकार ने 100 दिन के कार्यकाल का काफी जश्न मना लिया किन्तु गरीबी, बेरोजगारी, महंगाई आदि की ज्वलन्त समस्याओं को दूर करने, कानून-व्यवस्था बेहतर बनाने, सभी जाति व धर्माें में आपसी भाईचारा एवं साम्प्रदायिक सौहार्द पैदा करने के मामले में इनका कार्यकाल उदासीन व अति-निराशाजनक।
— Mayawati (@Mayawati) July 5, 2022