Parameshwara : సీఎం ఎంపిక‌లో వివాదం లేదు

మాజీ సీఎం ప‌ర‌మేశ్వ‌ర కామెంట్స్

Parameshwara : సీఎం రేసులో తాను కూడా ఉన్నానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ సీఎం ప‌ర‌మేశ్వ‌ర కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీ సాధించినా ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నే దానిపై ఇంకా స‌స్పెన్ష్ పెట్ట‌డం ఏమిటంటూ వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. సీఎం ఎంపిక విష‌యంలో ఎలాంటి వివాదం లేద‌న్నారు. పార్టీని ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టు కోవ‌డం త‌మ పార్టీ హైక‌మాండ్ బాధ్య‌త అని పేర్కొన్నారు.

బ‌య‌ట జ‌రుగుతున్నదంతా ఒట్టి ప్ర‌చారం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొన్నారు. పార్టీ పూర్తి న‌మ్మ‌కంతో , స్థిరంగా ఉంద‌న్నారు సీఎం ఎంపిక విష‌యంలో. ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింద‌ని మే 18న క‌ర్ణాట‌క‌కు సీఎం ఎవ‌ర‌నేది ప్ర‌క‌టిస్తార‌ని వెల్ల‌డించారు ప‌ర‌మేశ్వ‌ర‌. అత్యున్న‌త ప‌ద‌విపై ఎలాంటి స‌స్పెన్స్ లేద‌న్నారు. ఇందులో అనుమాన ప‌డాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు .

ఇప్ప‌టికే భారీ మెజారిటీ మాకు ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టారు. సీఎల్పీ స‌మావేశం ముగిసింది. పార్టీ ప‌రిశీల‌కులు పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాల‌ను తీసుకున్నారు. షిండే పూర్తి నివేదిక‌ను హై క‌మాండ్ కు స‌మ‌ర్పించారు. సీఎం ఎంపిక‌పై ఎలాంటి వివాదాలు చోటు చోసులేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక విధానాన్ని అవ‌లంభిస్తోంది. అదే కంటిన్యూ అవుతుంద‌ని , సీఎం ప్ర‌క‌ట‌న రావ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప‌ర‌మేశ్వ‌ర‌.

Also Read : Supreme Court

 

Leave A Reply

Your Email Id will not be published!