SM Krishna : పాలిటిక్స్ కు మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ గుడ్ బై
శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటన
SM Krishna : భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్. ఎం. కృష్ణ(SM Krishna) తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రంలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే బీజేపీ ప్రచారం కూడా ప్రారంభించింది. ప్రస్తుతం తనకు 90 ఏళ్లు అని, ఈ సమయంలో విశ్రాంతి అవసరమని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు ఎస్ఎం కృష్ణ. ప్రస్తుతం తాను 50 ఏళ్ల యువకుడిగా నటించ లేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రజా జీవితం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు మాజీ సీఎం.
ఈ కీలక సమయంలో ఎందుకు తప్పుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా పాత మైసూరు ప్రాంతం మాండ్యలో అడుగు పెట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో సీనియర్ నాయకుడు వైదొలగడం కొంత దెబ్బేనని పేర్కొనగా అలాంటిది ఏమీ ఉండదన్నారు.
తాను ఇంటి వద్ద నుంచే పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తానని స్పష్టం చేశారు ఎస్. ఎం. కృష్ణ. నేను పదవీ విరమణ చేయాలని అనుకున్నప్పుడు తనను పార్టీ విస్మరించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు మాజీ సీఎం. 1968లో తొలిసారిగా మాండ్య నియోజకవర్గం నుంచి ఎస్. ఎం. కృష్ణ(SM Krishna) ఎంపీగా ఎన్నికయ్యారు.
నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో కూడా కీలక పదవి చేపట్టారు. రాష్ట్ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. 1999లో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చేలా చేశారు. 2004 వరకు సీఎంగా పని చేశారు. మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. 2017లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.
Also Read : మోదీ మౌనం దేశానికి శాపం – పవార్