Babu Singh : హవాలా మనీ కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి బాబు సింగ్(Babu Singh) అరెస్ట్ అయ్యారు. 2022లో పీడీపీ – కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో బాబు సింగ్ మంత్రిగా పని చేశారు. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లోని కతువాకు చెందిన మాజీ మంత్రి ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు.
జితేంద్ర సింగ్ అకా బాబు సింగ్ ను కతువాలో జమ్మూ కాశ్మీర్ కు చచెందిన పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం జమ్మూకు తరలించారు. ఇదిలా ఉండగా పోలీసులు హవాలా రాకెట్ ను ఛేదించారు.
హవాలా లావాదేవీల్లో భాగంగా ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు. పూర్తి ఆధారాలు లభించడంతో మాజీ మంత్రి బాబు సింగ్ (Babu Singh)ను ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూ లో నిందితుల నుంచి రికవరీ చేసిన 6 లక్షలకు పైగా బాబు సింగ్ కు అప్పగించారని తెలిపారు పోలీసులు. కాగా బాబు సింగ్ గత కొంత కాలం నుంచి కేంద్రంలో కొలువు తీరిన కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన 370 ఆర్టికల్ రద్దు చేయడాన్ని వ్యతిరేకించారు. అంతే కాకుండా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా తగ్గించాడన్ని తప్పు పట్టారు.
కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరుగుతూ , ఎండగడుతూ ఉండడం వల్లనే తనను అరెస్ట్ చేశారంటూ బాబూ సింగ్ ఆరోపించారు. మొత్తంగా దేశ వ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యతిరేక శక్తులను ఏరి పారేయడంలో మోదీ త్రయం ఫుల్ బిజీగా ఉంది.
Also Read : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తల్హా సయీద్