EX Minister Chandrasekhar : బీజేపీకి షాక్ మాజీ మంత్రి గుడ్ బై
కాంగ్రెస్ పార్టీలో చేరనున్న చంద్రశేఖర్
EX Minister Chandrasekhar : తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. భారతీయ జనతా పార్టీకి కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చారు మాజీ మంత్రి, వికారాబాద్ జిల్లాకు చెందిన ఎ. చంద్రశేఖర్(EX Minister Chandrasekhar). ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. టీఆర్ఎస్ లో అగ్ర నాయకుడిగా పేరు పొందారు. మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత కేసీఆర్ తో పొసగక గులాబీకి గుడ్ బై చెప్పారు.
EX Minister Chandrasekhar To Congress
అనంతరం చోటు చేసుకున్న పరిణామాల రీత్యా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక్కడ పార్టీ నాయకత్వం, హైకమాండ్ పట్టించుకోక పోవడంతో నిరాశకు గురయ్యారు. ఈ మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై సంచలన ఆరోపణలు చేశారు. తనకు జెండా కప్పేందుకు కూడా సంశయించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో రెడ్లు, బ్రాహ్మణ కులాలదే ఆధిపత్యం కొనసాగుతోందని మండిపడ్డారు.
ఆదివారం సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఎ. చంద్రశేఖర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర సర్కార్ రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను , అన్యాయాలను నియంత్రించ లేక పోతోందంటూ ఆరోపించారు. అందుకే తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈనెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు ఎ. చంద్రశేఖర్.
Also Read : Group-2 Exam Postpone : నిరుద్యోగ అభ్యర్థులకు ఖుష్ కబర్