Kodali Nani : తలైవా నీకిది తగునా – కొడాలి నాని
చంద్రబాబుకు వంత పాడితే ఎలా
Kodali Nani : సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నటుడిగా ఆయన తన స్థాయిని దిగజార్చేలా మాట్లాడారంటూ నిప్పులు చెరిగారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani). ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్న రజనీకాంత్ చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచి, చిల్లర రాజకీయాలు చేస్తున్న బాబును ఎలా నెత్తికి ఎక్కించు కుంటావని ప్రశ్నించారు నాని.
పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు చంద్రబాబు రజనీకాంత్ తో ఫక్తు అబద్దాలు మాట్లాడించాడంటూ మండిపడ్డాడు. తలైవాకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఇప్పటికే పార్టీ పెడతానంటూ ప్రకటించి ఆ తర్వాత మిన్నకుండి పోయిన తలైవాకు ఏపీ రాజకీయాలతో పనేంటి అంటూ ప్రశ్నించారు కొడాలి నాని. తన స్థాయిని మరింత తక్కువ చేసేలా మాట్లాడారంటూ కనీసం ఇప్పటికైనా ఆలోచించు కోవాలని సూచించారు మాజీ మంత్రి.
ఏపీ పాలిటిక్స్ పట్ల రజనీకాంత్ ఇసుమంతైనా సమాచారం లేదన్నారు. దివంగత ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు తలైవా ఎలా ప్రవర్తించాడో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివినంత మాత్రాన ఓట్లు పడతాయని అనుకోవడం భ్రమ తప్ప మరొకటి కాదన్నారు కొడాలి నాని(Kodali Nani). చంద్రబాగు నాయుడి గురించి ప్రశంసలతో ముంచెత్తారు తలైవా. తనకు 30 ఏళ్ల నుంచి తెలుసన్నారు. హైదరాబాద్ అభివృద్దిలో బాబు పాత్ర ఎంతగానో ఉందన్నారు.
Also Read : భారీ వర్షం అతలాకుతలం