Jupally Ponguleti : జూపల్లి..పొంగులేటి దారెటు
సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
Jupally Ponguleti : ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. గత కొంత కాలం నుంచి నాన్చుతూ వచ్చిన భారత రాష్ట్ర సమితి కీలక ప్రకటన చేసింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ నిర్ణయంపై భగ్గుమన్నారు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై ఏకి పారేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సస్పెండ్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు జూపల్లి. ఇక పొంగులేటి అయితే వాడుకుని వదిలి వేశారంటూ ఆరోపించారు.
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తాము ప్రజల మధ్యనే ఉంటామని ప్రకటించారు. తెలంగాణ కోసం పదవులను త్యాగం చేశానని అన్నారు జూపల్లి. ఒక్క పైసా తీసుకోకుండా పార్టీ కోసం పని చేశానని చెప్పారు పొంగులేటి. అయినా తనను కావాలనే పక్కన పెట్టారంటూ ఆరోపించారు.
తనకు ఉన్న జనాదరణను చూసి తట్టుకోలేకనే ఇలా చేశారంటూ వాపోయారు. ఇది పక్కన పెడితే మాజీ ఎంపీ , మాజీ మంత్రి ఎటు వైపు వెళతారనేది వారి అనుచరుల్లో ,క్యాడర్ లో నెలకొంది. బీజేపీ వైపు చూస్తారా లేక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా అనేది చూడాలి.
Also Read : వాళ్లిద్దరు తెలంగాణ ద్రోహులు