Perni Nani BRS : బీఆర్ఎస్ పై పేర్ని నాని కామెంట్స్

ఏపీ విభ‌జ‌న‌కు కార‌ణం టీఆర్ఎస్

Perni Nani BRS : సీఎం కేసీఆర్ స్థాపించిన భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని నాని. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్ని పార్టీలు రాష్ట్రంలో వ‌చ్చినా వైసీపీని ఏమీ చేయ‌లేర‌న్నారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్ ఇలా ఇంకా ఎన్నో పార్టీలు వ‌స్తాయి. ఇంకా వంద పార్టీలు వ‌చ్చినా అభ్యంత‌రం లేద‌న్నారు పేర్ని నాని.

ఎవ‌రి స‌త్తా ఏమిటో జ‌నాల‌కు బాగా తెలుస‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాన్ని , ప్ర‌జ‌ల‌ను నానా తిట్లు తిట్టిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ ది కాదా అని నిల‌దీశారు మాజీ మంత్రి. త‌మ‌ను ఇబ్బంది పెట్టాల‌ని అనుకున్న వాళ్లు అడ్ర‌స్ లేకుండా పోయార‌న్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో కేఏ పాల్ స్థాపించిన ప్ర‌జా శాంతి పార్టీ కూడా పోటీ చేస్తుంద‌న్నారు.

ఒక ర‌కంగా పేర్ని నాని బీఆర్ఎస్ ను (Perni Nani BRS) ఎద్దేవా చేశారు. విచిత్రం ఏమిటంటే కేఏ పాల్ పార్టీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఒక్క‌టే అని అర్థం వ‌చ్చేలా కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఏది ఏమైనా పేర్ని నాని ఏది మాట్లాడినా అందులో వ్యంగ్యం ఉంటుంది. తాజాగా ఈ దేశంలో ఎవ‌రైనా ఎక్క‌డి నుంచైనా పోటీ చేసేందుకు వీలుంటుంది. అది ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తారు.

ఎవ‌రు ప‌ని చేస్తారో లేదా అని పేర్కొన్నారు మాజీ మంత్రి. మ‌రో వైపు తెలంగాణ మంత్రుల‌పై నిప్పులు చెరిగారు. ఏపీలో వాళ్లు వ‌చ్చి ఏం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. శ్రీ‌శైలం, సాగ‌ర్, పులి చింత‌ల‌లో క‌రెంట్ ను అక్ర‌మంగా తీసుకోవ‌డం లేదా అని మండిప‌డ్డారు పేర్ని నాని.

Also Read : బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా తోట చంద్ర‌శేఖర్

Leave A Reply

Your Email Id will not be published!