Vatti Vasanth Kumar : వట్టి వసంతకుమార్ కన్నుమూత
ఏపీలో అరుదైన రాజకీయ నేత
Vatti Vasanth Kumar : ఏపీకి చెందిన మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖ పట్టణంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడించారు. వట్టి వసంత కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పూండ్ల. ఉంగుటూరు ఎమ్మెల్యేగా గతంలో పని చేశారు.
2004, 2009 లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గా పని చేశారు వట్టి వసంత కుమార్. అంతే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కూడా ఆయన పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. వట్టి వసంత కుమార్ భౌతిక కాయాన్ని స్వస్థలం పూండ్లకు తరలిస్తున్నారు. అక్కడే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా గుర్తింపు పొందారు. మంత్రివర్గ శాఖల కేటాయింపులో తన వర్గానికి అవమానం జరిగిందన్న కారణంతో ఆనాడు వట్టి వసంత కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఆయన జూన్ 10, 1953లో పుట్టారు.
వట్టి వసంత కుమార్(Vatti Vasanth Kumar) సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ నాయకుడిగా ఉన్నారు. ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర కనబర్చారు. ఆటలు, సంగీతం అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. సింగపూర్ , థాయిలాండ్ , దక్షిణకొరియా, ఆస్ట్రేలియా , తైవాన్ లలో విదేశీ పర్యటనలు చేపట్టారు.
Also Read : చంద్రబాబు 420 లోకేష్ 120