DR Rajiv Kumar : నోట్ల రద్దు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు
నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్
DR Rajiv Kumar : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన నోట్ల రద్దు నిర్ణయంపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వారు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పూర్తిగా ఏకీభవించ లేదు. నలుగురు మోదీ ప్రభుత్వ నిర్ణయానికి వత్తాసు పలికితే ఒక్కరు జస్టిస్ నాగరత్న మాత్రం దానిని పూర్తిగా వ్యతిరేకించారు.
ఒక రకంగా కేంద్రాన్ని తప్పుపట్టారు. నోట్ల రద్దు చట్ట విరుద్దమని, అది చట్టానికి లోబడి జరగలేదని పేర్కొన్నారు. అంతే కాదు ప్రజాస్వామ్యంలో ప్రతిదీ చర్చించాల్సి ఉంటుందని, కానీ రాచరిక వ్యవస్థలో ఉన్నట్లు అప్పటికప్పుడు నోట్లను రద్దు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
తీర్పు సర్కార్ కు మద్దతుగా వెలువడినా చివరకు భిన్నాభిప్రాయం వ్యక్తం కావడం ఓ చెంప పెట్టు లాంటిదేనని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అయిన రాజీవ్ కుమార్(DR Rajiv Kumar) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల ఏదైతే ఆశించామో అది జరగలేదని పేర్కొన్నారు.
ఒకవేళ జరిగి ఉంటే ఇంతటి ఇబ్బందులు ఎదురయ్యేవి కావన్నారు. ప్రస్తుతం నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చు కోవాలంటే కేవలం మిగిలి ఉన్నది ఒక్కటి అది డిజిటలైజేషన్ మాత్రమేనని స్పష్టం చేశారు రాజీవ్ కుమార్(DR Rajiv Kumar). మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఎక్కువగా నగదుతో నడుస్తోందన్నారు. దానిని గుర్తించక పోవడం వల్ల నష్టం వాటిల్లిందన్నారు రాజీవ్ కుమార్.
Also Read : రద్దు తర్వాత పెరిగిన నోట్ల చలామణి