AS Dulat Rahul Yatra : రాహుల్ తో జతకట్టిన ‘రా’ మాజీ చీఫ్
నెట్టింట్లో ఏఎస్ దులత్ హల్ చల్
AS Dulat Rahul Yatra : ఈ దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాలంటూ నినాదంతో దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్తర ప్రదేశ్ లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన యాత్ర పట్ల ప్రశంసలు కురిపించారు రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ . మరో వైపు రామ మందిరం ట్రస్టు కార్యదర్శి చింతన్ రాయ్ కూడా తాము భారత్ జోడో యాత్రకు వ్యతిరేకం కాదన్నారు.
ఈ తరుణంలో దేశ రక్షణలో కీలక విభాగమైన అర్ అండ్ ఏ డబ్ల్యూ చీఫ్ ఏఎస్ దులత్ బుధవారం జరిగిన రాహుల్ యాత్ర(AS Dulat Rahul Yatra) లో పాల్గొన్నారు. ఆయన యాత్రకే హైలెట్ గా నిలిచారు. రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగులు వేశారు. ఇది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆయన గతంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో సెక్రటరీగా పని చేశారు. ఆయన పూర్తి పేరు అమర్ జిత్ సింగ్ దులత్(AS Dulat). ఇదిలా ఉండగా గత ఏడాది 2022లో తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.
ఇప్పటికే 9 రాష్ట్రాలను పూర్తి చేశారు. వాటిలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్, హర్యానా , ఢిల్లీ పూర్తయింది. తాజాగా యూపీలో కొనసాగుతోంది. కాగా ఈ యాత్రలో పాల్గొనాలంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ , బీఎస్పీ చీఫ్ మాయావతిని కోరారు రాహుల్ గాంధీ.
Also Read : పూనావాలాకు కాంగ్రెస్ ఆహ్వానం