Captain Miller : తమిళ సినిమాకు సంబంధించి పలు సినిమాలు విడుదల అయ్యేందుకు పోటీ పడుతున్నాడు. ఇప్పటికే తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ రెడీ అయ్యింది. అమెరికాలో 600 థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేశారు. అగ్ర నటుడు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్(Captain Miller) కూడా రిలీజ్ కు సిద్దమైంది. జోసెఫ్ విజయ్ నటించిన లియో కూడా ప్లాట్ ఫారమ్ మీద ఉంది. దీంతో అగ్ర నటుల మధ్య పోటీ యాధృశ్చికంగా కొనసాగుతోంది.
Captain Miller & Dhanush’s Upcoming
ఇప్పటికే ధనుష్ మూవీకి సంబంధించి ఫోస్టర్స్ ,టీజర్స్ ఆకట్టుకున్నాయి. కెప్టెన్ మిల్లర్ కు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. కథ కూడా ఆయనే రాశారు. సెంథిల్ త్యాగరాజన్ , అర్జున్ త్యాగరాజన్ దీనిని నిర్మించారు. ఇక ధనుష్ కు తోడుగా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తమిళంలో తీసిన ఈ చిత్రం భారత దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఇది పూర్తిగా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ధనుష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ , సందీప్ కిషన్ , జాన్ కొక్కెన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై నిర్మాణం జరిగింది ఈ చిత్రం. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు ధనుష్. ఈ మధ్యనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Also Read : Yash 15 Years : 15 ఏళ్లు పూర్తి చేసుకున్న యష్