Tamilisai Soundararajan : తమిళిసై ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ
ఎమ్మెల్యేల కొనుగోలు..మునుగోడు
Tamilisai Soundararajan : రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓ వైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరో వైపు మునుగోడు ఉప ఎన్నికలపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ రెండూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అధికార పార్టీకి ఉప ఎన్నికను సవాల్ గా తీసుకుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా లేదా అనేది ఈ ఎన్నిక ఫలితంపై ఆధారపడి ఉంటుంది.
ఇక భారతీయ జనతా పార్టీకి ఇది జీవన్మరణ సమస్య. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందంటోంది టీఆర్ఎస్. అదంతా తనంతకు తానుగా టీఆర్ఎస్ ఆడిన నాటకం అంటూ కాషాయ పార్టీ నేతలు కొట్టి పారేశారు. తాము బరా బర్ కొంటామని కానీ దొంగ చాటుగా కొనేంత స్థితికి దిగ జార లేదన్నారు కేంద్ర మంత్రి.
ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే లేని తప్పు తమకు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మరో వైపు బంజారా హిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన ఘటన కలకలం రేపింది.
అంతకు ముందు అమ్నీషియా పబ్ వ్యవహారంపై కూడా సీరియస్ గా స్పందించారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్(Tamilisai Soundararajan). వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. కానీ ఇప్పటి దాకా పోలీసులు స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా మారి పోయిందన్న విమర్శలు ఉన్నాయి.
తాజాగా గవర్నర్ ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న దానిపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు. ఆమె పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
Also Read : తాల్ సే తాల్ మిలా రాహుల్ గాంధీ ఫిదా