Shiva Murthy Murugha : మురుగ పీఠాధిపతి రిపోర్టుపై ఉత్కంఠ
నిందితులకు విరుద్దంగా రిపోర్టు
Shiva Murthy Murugha : కర్ణాటకలో అత్యంత బలమైన మఠాధిపతులలో ఒకరుగా ఉన్నారు మురుగ మఠం పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి శరణారావు. ఆయన గత ఏడాది 2022లో అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. పౌర సమాజం నుండి పెరుగుతున్న ఒత్తిళ్ల మధ్య ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఆనాటి నుండి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాల ఆరోపణలు ఆయన అరెస్ట్ కాబడ్డారు. కర్ణాటకలో అత్యంత ప్రభావంతమైన మత గురువుగా గుర్తింపు పొందారు శివమూర్తి శరణారావు(Shiva Murthy Murugha). ఇద్దరు టీనేజ్ బాలికల వైద్య నివేదికలో చొచ్చుకు పోయే సెక్సుకు పాల్పడినట్లు ఆధారాలు లభించలేనట్లు సమాచారం.
మఠం పీఠాధిపతిపై ఆరోపణలు చేసిన బాలికలకు వైద్య పరీక్షలు చేపట్టారు. చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ , మైనర్ బాలికల కనుబొమ్మలు చెక్కు చెదరకుండా ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక చిత్రదుర్గ లోని ఆశ్రమంలో మూడేళ్లుగా తమపై పదే పదే లైంగిక వేధింపులకు గురైనట్లు ఇద్దరు బాలికలు ఫిర్యాదు చేశారు.
కాగా నమోదు చేసిన వాంగ్మూలాలకు విరుద్దంగా ఉండడం విస్తు పోయేలా చేసింది. ఆగస్టు 26న మైసూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసు కేసు నమోదైంది. ఆ తర్వాత రెండు రోజులకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్ లో మరో నలుగురు బాలికలు పీఠాధిపతిపై ఇలాంటి ఆరోపణలు చేశారు.
కాగా వారి వైద్య పరీక్షలకు సంబంధించి ఇంకా నివేదికలు రాలేదు. ఈ మొత్తం ఆరోపణలపై మురుగ పీఠాధిపతి శివమూర్తి(Shiva Murthy Murugha) స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలడం ఖాయమన్నారు.
Also Read : మౌనంగా ఉంటే కోటి ఆఫర్ – కోచ్