Election Results 2022 : ప్రధాన రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్యగా భావిస్తున్న దేశంలొని ఐదు రాష్ట్రాల ఎన్నికల (Election Results 2022)పర్వం ముగిసింది. అసలైన ఫలితాల కోసం ఉత్కంఠ మొదలైంది.
ఉత్తర ప్రదేశ్ ,ఉత్తరాఖండ్ , మణిపూర్ , గోవా, పంజాబ్ రాష్ట్రాలలో ఆయా పార్టీల భవితవ్యాన్ని నిర్దేశిస్తాయి. యూపీలో బీజేపీ, ఆప్, బీఎస్పీ, సమాజ్ వాది పార్టీ, ఎంఐఎంతో పాటు ఇతర పార్టీలు పోటీ చేశాయి.
ఇక గోవాలో బీజేపీ, కాంగ్రెస్ , ఎంజీపీ, ఆప్, టీఎంసీ బరిలో నిలిచాయి. పంజాబ్ లో కాంగ్రెస్ , ఆప్ , పంజాబ్ లోక్ కాంగ్రెస్ , బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పార్టీ పోటీ చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అసలైన పోటీ నెలకొంది.
మణిపూర్ లో బీజేపీకి ఎడ్జ్ ఉంది. మొత్తంగా నువ్వా నేనా అన్న రీతిలో పార్టీలు పోటీ పడ్డాయి. యూపీలో బీజేపీ, ఎస్పీ మధ్య నెలకొంది. ఇక ఆయా రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈనెల 10న ఉదయం నుంచి ఫలితాలు వెలువడనున్నాయి.
ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తుంది. అనంతరం ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు.
ఆయా రాష్ట్రాల అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వకు మొత్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 403 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
దేశంలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉన్నాయి. పంజాబ్ లో 117 సీట్లు, మణిపూర్ లో 60 సీట్లకు పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం యూపీ, మణిపూర్ లో బీజేపీ హవా ఉందంటూ పేర్కొన్నాయి.
పంజాబ్ లో ఆప్ , ఉత్తరాఖండ్, గోవాలలో నువ్వా నేనా పోటీ నెలకొందని తెలిపాయి.
Also Read : శశి థరూర్ కు ట్రబుల్ షూటర్ ఫోన్