Vice Presidential Poll : ఉప రాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ
నువ్వా నేనా అంటున్న ధన్ ఖర్..అల్వా
Vice Presidential Poll : భారత దేశంలో అత్యున్నత రెండో పదవిగా భావించే ఉప రాష్ట్రపతి ఎన్నిక శనివారం జరగనుంది. మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్ ఖర్ పోటీలో ఉన్నారు.
ఇక ప్రతిపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా బరిలో నిలిచారు. ఉప రాష్ట్రపతిగా గెలవాలంటే 372 కంటే 527 ఓట్లను ఎక్కువ ఆశిస్తున్నారు.
ఎక్కువ మంది ఓట్లను కలిగిన బీజేపీ సంకీర్ణ అభ్యర్థి ధన్ ఖర్ సులభంగా గెలిచే అవకాశం ఉంది. ఇక విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా రెండో స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇవాళ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవనంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు(Vice Presidential Poll) సాయంత్రం తర్వాత వెలువడనున్నాయి.
మొత్తం ఓట్లలో 70 శాతం వెంకయ్య నాయుడు కంటే రెండు శాతం ఎక్కువ. ఎలక్టోరల్ కాలేజీలో 780 మంది ఎంపీలు ఉన్నారు. లోక్ సభలో 543 మంది ఉండగా రాజ్యసభలో 245 మంది ఉన్నారు.
ఇక ఎగువ సభలో ఖాళీగా ఉన్న ఎనిమిది స్థానాలతో పాటు ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న టీఎంసీ ఎంపీలు 36 మందిని పక్కన పెడితే 744 మంది ఎంపీలు ఓటు వేయనున్నారు.
బీజేపీకి చెందిన 394 మందితో సహా ఎన్డీయేకు 441 మంది ఎంపీల బలం ఉంది. నామినేటెడ్ సభ్యులు కూడా ఎన్డీయే వైపు మొగ్గు చూపుతున్నారు.
Also Read : నాగాలాండ్ సమస్యను పరిష్కరించండి