హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న కె. రామకృష్ణారావు పదవీ కాలం పొడిగించేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న దృష్ట్యా రామకృష్ణరావు పదవీ కాలం పూర్తయినా మరికొంత కాలం పాటు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి కేంద్ర సర్కార్ కు విన్నవించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మూడు నెలల పాటు పొడిగిస్తూ ఓకే చెప్పింది.
ఇదిలా ఉండగా గత ఏడాది 2025 ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు స్వీకరించారు. వాస్తవానికి తన ప్రస్తుత పదవీ కాలాన్ని ఆగస్టు 31న పూర్తి చేయాల్సి ఉంది. గతంలో రాష్ట్ంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పదేళ్ల పాటు పాలన కొనసాగింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే క్రమంలో రామకృష్ణారావు కంటే ముందు శాంతి కుమారి సీఎస్ గా పని చేశారు. ప్రస్తుతం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి రేసులో సీనియర్ ఐఏఎ్ లు ఉన్నారు. వీరిలో ప్రధానంగా ప్రస్తుతం పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న జయేష్ రంజన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
