ED Director Sanjay Mishra : ఈడీ డైరెక్ట‌ర్ ప‌ద‌వీ కాలం పొడిగింపు

ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

ED Director Sanjay Mishra : దేశంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన ద‌ర్యాప్తు సంస్థ‌గా పేరొందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కి డైరెక్ట‌ర్ గా ఉన్న సంజ‌య్ మిశ్రా ప‌ద‌వీ కాలం నేటితో ముగియ‌నుంది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఏడాది పాటు పొడిగిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఇదిలా ఉండ‌గా 2020లో ప‌ద‌వీ విర‌మణ చేశాడు. కానీ ఇప్ప‌టికే రెండుసార్లు పొడిగింపులు పొందాడు. ఇక న‌వంబ‌ర్ 19, 2018న జారీ చేసిన ఉత్త‌ర్వు ద్వారా సంజ‌య్ మిశ్రా(ED Director Sanjay Mishra) మొద‌టిసారిగా రెండేళ్ల కాలానికి ఈడీ డైరెక్ట‌ర్ గా నియ‌మితుల‌య్యారు.

ఆయ‌న ప‌నితీరుకు గుర్తింపుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో ఏడాది పొడిగించేందుకు మొగ్గు చూపింది. ఇది కీల‌క‌మైన మ‌నీ లాండ‌రింగ్ కేసుల‌ను తార్కిక ముగింపున‌కు తీసుకెళ్లేందుకు ఏజెన్సీలో కొన‌సాగింపును నిర్దారించే చ‌ర్య‌గా అధికారులు అభివ‌ర్ణించారు.

సంజ‌య్ మిశ్రా ఏడాది పాటు అంటే న‌వంబ‌ర్ 18, 2022 త‌ర్వాత ఒక సంవ‌త్స‌రం పాటు న‌వంబ‌ర్ 18, 2023 వ‌ర‌కు ఈడీ డైరెక్ట‌ర్ గా కొన‌సాగుతారు. ఈ మేర‌కు క్యాబినెట్ నియామ‌కాల క‌మిటీ ఆమోదించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

కాగా 2021 న‌వంబ‌ర్ లో ప్ర‌భుత్వం సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న్ (సీవీసీ) చ‌ట్టంతో పాటు ఢిల్లీ స్పెష‌ల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చ‌ట్టాన్ని స‌వ‌రించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

ఇదిలా ఉండ‌గా సంజ‌య్ కుమార్ మిశ్రా హ‌యాంలో యెస్ బ్యాంక్ మాజీ ఎండీ , చీఇఓ రాణా క‌పూర్ , ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ , సిఇఓ చందా కొచ‌ర్ భ‌ర్త ద‌ప‌క్ కొచ్చ‌ర్ , క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ , అగ‌స్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ మ‌ధ్య‌వ‌ర్తి క్రిస్టియ‌న్ మిచెల్ జేమ్స్ తో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు మనీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్ మేన‌ల్లుడు ర‌తులు పూరి, మ‌హారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ల‌ను అరెస్ట్ చేశారు. లండ‌న్ నుంచి పారి పోయిన విజ‌య్ మాల్యా, సంజ‌య్ భండారీ, నీర‌వ్ మోదీల‌ను ర‌ప్పించేందుకు ఈడీ హామీ ఇచ్చింది.

Also Read : జైన్’ కు షాక్ మ‌ళ్లీ జైలుకే

Leave A Reply

Your Email Id will not be published!