F3 Lab Dab Song : 7న ఎఫ్-3 మూవీ సాంగ్ రిలీజ్

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

F3 Lab Dab Song : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరొందారు అనిల్ రావిపూడి. స్ప‌ష్ట‌మైన మెసేజ్ తో పాటు వినోదాన్ని, ఆరోగ్య క‌ర‌మైన హాసాన్ని అందించ‌డంలో త‌న‌కు తానే సాటి.

తెలుగు సినీ రంగంలో ఇప్ప‌టికే న‌వ్వులు పండించారు జంధ్యాల‌, ఇవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, శ్రీ‌నివాస్ రెడ్డి , శివ నాగేశ్వ‌ర్ రావు. వారి తో పాటే అనిల్ రావిపూడి న‌వ్వుల పంట పండిస్తున్నాడు.

త‌న‌దైన ముద్ర‌తో దూసుకు పోతున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌న తీసిన ప్ర‌తి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప‌టాస్ నుంచి నేటి స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం దాకా అన్నీ విజ‌య‌వంత‌మైన సినిమాలే.

ఇక ఇప్ప‌టికే దిల్ రాజు నిర్మాణంలో ఆయ‌న తీసిన ఎఫ్ -2 చిత్రం బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. కాసులు కొల్ల గొట్టింది. ఈ మూవీ న‌వ్వుల్ని పూయించింది. హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది.

కుటుంబంలో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య బంధం ఎంత గొప్ప‌ద‌నే విష‌యాన్ని ఈ మూవీలో చూపించాడు. ఇందులో విక్ట‌రీ వెంక‌టేశ్ , వ‌రుణ్ తేజ్ , త‌మ‌న్నా భాటియా, మెహ‌రీన్ న‌టించారు. ప్ర‌గ‌తి, ప్ర‌దీప్ కూడా త‌మ‌దైన శైలిలో ఆక‌ట్టుకున్నారు.

క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు ఎఫ్‌-3 మూవీని(F3 Lab Dab Song). ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కావ‌డంతో సినిమా తేదీని కూడా క‌న్ ఫ‌ర్మ్ చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామ‌ని మూవీ మేక‌ర్స్. ఇవాళ ఎఫ్ -3 కి సంబంధించి అప్ డేట్(F3 Lab Dab Song) ఇచ్చారు. ఈనెల 7న పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. దీనికి గ‌త మూవీకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ సీక్వెల్ మూవీకి కూడా ఇచ్చాడు.

Also Read :‘త్రివిక్రం..మ‌హేష్’ చిత్రం ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!