F3 Movie : ఎఫ్‌-3 మూవీ న్యూ అప్ డేట్

మే 2న టీజ‌ర్ రిలీజ్

F3 Movie : స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా పేరొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎఫ్ -2 సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. దీంతో సినీ నిర్మాత దిల్ రాజు ఎఫ్ -2 మూవీకి సీక్వెల్ గా ఎఫ్ -3 చిత్రం (F3 Movie)శ‌ర‌వేగంగా రూపుదిద్దుకుంటోంది.

చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు, పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. విక్ట‌రీ వెంక‌టేశ్ , వ‌రుణ్ తేజ్ , త‌మ‌న్నా భాటియా, మెహ‌రీన్ తో పాటు ప్ర‌గ‌తి, ఆలీ, సునీల్ ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే పోస్ట‌ర్లు విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మూవీ మేక‌ర్స్ మ‌రో బిగ్ అప్ డేట్ ను ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్బంగా బ్లాస్టింగ్ టుమారో అంటూ వీడియోను పోస్ట్ చేసింది మేక‌ర్స్ . ఈనెల 2న ఉద‌యం 10. 08 నిమిషాల‌కు రానుంద‌ని ప్ర‌క‌టించారు. ఫ్యాన్స్ మాత్రం టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

మ‌రి ఈ ఫ‌న్ బ్లాస్ట్ ఏమిట‌నేది వేచి చూడాల్సి ఉంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. ఇదిలా ఉండ‌గా ఎఫ్ -3 చిత్రానికి సంబంధించి ఓ స్పెష‌ల్ సాంగ్ లో న‌టించ‌నుంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే.

ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. పోస్ట‌ర్, వీడియో కూడా పోస్ట్ చేసింది మూవీ మేక‌ర్స్. అవుట్ అండ్ అవుట్ కామెడీ పండించ‌నున్న‌ట్లు ఈ మూవీ. ఈ నెల 27న ఎఫ్ -3 ని విడుద‌ల కానుంది.

ఈ మూవీ ఎప్పుడు వ‌స్తుందోన‌ని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.

Also Read : స‌మంత‌కు విజ‌య్ స‌ర్ ప్రైజ్ గిఫ్ట్

Leave A Reply

Your Email Id will not be published!