F3 Movie : ఎఫ్‌-3 మూవీ ట్రైల‌ర్ డేట్ ఫిక్స్

ఈనెల 9న విడుద‌ల

F3 Movie : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎఫ్‌-3 మూవీపై (F3 Movie) భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే ఎఫ్ -2 మూవీ వంద శాతం న‌వ్వులు పూయించింది. బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. కాసులు కొల్ల‌గొట్టింది.

విక్ట‌రీ వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ , త‌మ‌న్నా భాటియా, మెహ‌రీన్ , ప్ర‌గ‌తి, ఆలీ, సునీల్ న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు, పాట‌లకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

ఎఫ్2 చిత్రం భారీ హిట్ టాక్ రావ‌డంతో ఎఫ్ 3 మూవీ సీక్వెల్ గా తీస్తున్నారు. వినోదం అందించ‌డం ప‌క్కా అని ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ప్ర‌క‌టించాడు. ఆ దిశ‌గానే సినిమా కూడా సాగుతోంది.

ఎఫ్‌-3 మూవీ షూటింగ్ పూర్తి కావ‌చ్చింది. ఈనెల 27న చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని మూవీ మేక‌ర్స్ డిసైడ్ చేశారు. న‌వ్వులు పూయించేందుకు రెడీ చేశామ‌ని తెలిపారు ద‌ర్శ‌కుడు.

పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వ‌డం ప‌క్కా అని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో సినిమాకు సంబంధించి ఈనెల 1న మూవీ మేకర్స్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఫ‌న్ బాంబు రాబోతోందంటూ ప్ర‌క‌టించి మ‌రింత ఉత్సుక‌త‌ను పెంచేలా చేశారు.

ఈ త‌రుణంలో ఈనెల 9వ తేదీన ఎఫ్-3 చిత్రానికి (F3 Movie)సంబంధించి ట్రైల‌ర్ విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్ . విడుద‌లైన పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

డబ్బు వాల్యూ గురించి ఎఫ్-3లో ఫోక‌స్ పెట్టిన‌ట్లు టాక్. ఏది ఏమైనా అనిల్ రావిపూడి అంటేనే వినోదానికి కేరాఫ్‌. ఇక ఎఫ్ 3 మూవీలో అదిరి పోయేలా పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్ ఉండ‌డం అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.

Also Read : స‌ల్మాన్ ఖాన్ తో బుట్ట బొమ్మ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!