Facebook Insta Deleted : 2.7 కోట్ల పోస్ట్ లు తొలగింపు – మెటా
సంచలన ప్రకటన చేసిన దిగ్గజ సంస్థ
Facebook Insta Deleted : ఫేస్ బుక్ దాని అనుబంధమైన ఇన్ స్ట్రా గ్రామ్ లో కీలకమైన పోస్టులను తొలగించింది. ఈ విషయాన్ని మెటా వెల్లడించింది.
ఈ పోస్టులన్నీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 కోట్ల 70 లక్షల పోస్టులు.
ఈ ఏడాది జూలై నెలలో భారత దేశంలో 1.7 కోట్లకు పైగా స్పామ్ లను గుర్తించి తొలించినట్లు స్పష్టం చేసింది మెటా. ఇదిలా ఉండగా మెటా గత నెలలో కంటెంట్ పై తీసుకున్న చర్యల గురించి సాధారణ నివేదికలను ప్రచురిస్తుంది.
ఒక్క జూలై నెలలోనే ఇండియాలో ఫేస్ బుక్ నుండి 2.5 కోట్ల పోస్ట్ లు , ఇన్ స్ట్రా గ్రామ్ లో 20 లక్షల పోస్ట్ లను తొలగించింది(Facebook Insta Deleted). మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ లు ఉన్నాయి.
ఈ రెండింటితో కలిపి రెండున్నర కోట్లకు పైగా ఉన్నాయని పేర్కొంది. ఐటీ నిబంధనల ప్రకారం మధ్యవర్తిగా ఉంది ఈ సంస్థ.
ప్రభుత్వ రూల్స్ ను పాటించే ప్రయత్నాలలో భాగంగా హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ కోసం 1.73 కోట్ల స్పామ్ పోస్ట్ లను , 23 లక్షల పోస్ట్ లను తొలగించినట్లు వెల్లడించింది మెటా.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులపై
తీసుకున్న చర్యల వివరాలను కూడా మెటా స్పష్టం చేసింది.
మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ -2021 కింద నెల వారీ నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది మెటా.
ప్రోయాక్టివ్ రేట్ 99.6 శాతం, స్పామ్ పై తీసుకున్న చర్యలతో పాటు ద్వేష పూరిత ప్రసంగాలకు సంబంధించిన 1.1 లక్షల పోస్ట్ లు, హింసాత్మక, గ్రాఫిక్
కంటెంట్ కు సంబంధించిన 23 లక్షల పోస్ట్ లు, నగ్నత్వం, లైంగిక కంటెంట్ తో కూడిన 27 లక్షల పోస్ట్ లు తొలగించినట్లు మెటా తెలిపింది.
Also Read : ట్రంప్ సోషల్ మీడియాకు నో చాన్స్